|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వంభర థియేట్రికల్ హక్కులు దక్కించుకున్నది ఎవరో తెలుసా? సంచలనDeal!

Published: 21-03-2026, 11:35 AM
విశ్వంభర థియేట్రికల్ హక్కులు దక్కించుకున్నది ఎవరో తెలుసా? సంచలనDeal!
  • చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రం తెరకెక్కుతోంది.
  • ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
  • అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్, జీ గ్రూప్ శాటిలైట్ హక్కులను పొందాయి.
  • చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ విజయం సాధించింది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

విశ్వంభర మూవీ విశేషాలు

Vishwambhara Movie:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర(Vishwambhara). ఎప్పుడో గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. బింబిసార సినిమాతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా నుండీ విడుదలైన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియోలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా మౌని రాయ్, చిరంజీవిల పై ఐటమ్ సాంగ్ చిత్రీకరించారని సమాచారం. ఇది కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ నేపథ్యంలోనే అటు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న దిల్ రాజు

అయితే శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ సినిమా విడుదలైన తర్వాతే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దిల్ రాజు బైకర్ పై అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలయ్యాకే విశ్వంభర థియేట్రికల్ హక్కుల గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, సాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు ఎవరికి?

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. 7 పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చివరిగా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ చూసిన చిరంజీవి.. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచారు. మొత్తానికైతే 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించి మరోసారి తన మ్యాజిక్ చూపించారు చిరంజీవి. ఇకపోతే ప్రస్తుతం ఈయన ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం . ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి 2024 సంక్రాంతి సందర్భంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ బాబి చిరంజీవి కాంబోలో మూవీ అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఇలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.

మొత్తానికి చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. దిల్ రాజు చేతికి థియేట్రికల్ హక్కులు రావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.