|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణు ప్రియ సంచలనం: వేణు స్వామి గురించి ఆ షాకింగ్ విషయాలు బయటపెట్టింది!

Published: 16-12-2025, 12:04 AM
విష్ణు ప్రియ సంచలనం: వేణు స్వామి గురించి ఆ షాకింగ్ విషయాలు బయటపెట్టింది!
  • మార్ఫింగ్ వీడియోల వల్ల తీవ్ర అవమానం ఎదుర్కొన్న విష్ణు ప్రియ.
  • ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడి.
  • తల్లి ఆసుపత్రి బిల్లుల కోసం వేణు స్వామి చేసిన అనూహ్య సాయం.
  • వేణు స్వామి వల్లే తన తల్లి మరో ఏడాది కాలం జీవించిందని ఎమోషనల్.

యాంకర్ విష్ణు ప్రియ తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను బయటపెట్టింది. మార్ఫింగ్ వీడియోల బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. కష్టకాలంలో జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన అనూహ్య సాయం గురించి చెప్పి, ఆయనపై ప్రశంసలు కురిపించింది. ఈ విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

విష్ణు ప్రియ ఎదుర్కొన్న కష్టాలు, ఆత్మహత్య ప్రయత్నం

విష్ణు ప్రియ (Vishnu Priya)యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసి ‘పోవే పోరా’ (pove pora)గేమ్ షో పాపులారిటీని తెచ్చిపెట్టింది. యాంకర్‌గానూ కాకుండా.. నటిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించింది. ఇక రియాలిటీ షో బిగ్‌బాస్ లోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా, ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన జీవితంలో జరిగిన పలు సంఘటనలు పంచుకుంది. తన మార్ఫింగ్ వీడియోల వల్ల చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్మ కూడా చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కష్టసమయంలో.. వేణు స్వామి తనను ఆదుకున్నారని చెప్తూ ప్రశంసలు కురిపించింది.

గత కొద్ది రోజులుగా ఆయనపై విమర్శలు వస్తున్నా.. తనకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. తన తల్లి చనిపోయే సమయంలో.. హాస్పిటల్ బిల్లులు లక్షల్లో కట్టాల్సి ఉండగా.. అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియని పరిస్థితుల్లో వేణు స్వామి(Venu Swamy)ని చేశానని. వెంటనే ఆయన తనకు సాయం అందించారని తెలిపింది. ఆయన వల్లే డాక్టర్లు మూడు రోజులే బతుకుతుందని చెప్పిన తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని చెప్పి ఎమోషనల్ అయింది. నిజంగా ఆయన అంత సాయం చేస్తారని అనుకోలేదు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణు స్వామి అని పొగిడేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అది గమనించిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. పూజలే చేయడమే కాదు.. సాయం కూడా చేస్తారా? అని అంటున్నారు.

వేణు స్వామి సాయంతో తల్లికి ప్రాణం పోసిన వైనం

మేడారం జాత‌ర‌పై వేణుస్వామి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు !

యాంకర్, నటిగా విష్ణు ప్రియ ప్రస్థానం

నటిగా నన్ను మరో మెట్టు పైన నిలబెట్టే ప్రాజెక్ట్ ఇది..ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: శ్రీలీల

విష్ణు ప్రియ వ్యాఖ్యలు వేణు స్వామి గురించి కొత్త చర్చకు దారి తీశాయి. వివాదాలతో వార్తల్లో నిలిచే వేణు స్వామిలో ఈ మంచి కోణాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విష్ణు ప్రియ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.