|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్: లిప్ కిస్ తో షాకింగ్ ట్రీట్! యూత్ కి పూనకాలే!!

Published: 18-02-2026, 10:05 AM
శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' టీజర్: లిప్ కిస్ తో షాకింగ్ ట్రీట్! యూత్ కి పూనకాలే!!
  • శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదల!
  • టీజర్లో శ్రీ విష్ణు మార్క్ సెటైరికల్ డైలాగ్స్, యూత్ ఫుల్ రొమాన్స్!
  • హీరోయిన్ నయన్ సారిక హోమ్లీ లుక్, బోల్డ్ యాటిట్యూడ్‌తో అదరగొట్టింది.
  • శ్రీ విష్ణు గత చిత్రాలనే ఫార్ములాతో వస్తున్నాడు. హిట్ అవుతుందా?

శ్రీ విష్ణు మరోసారి తన సక్సెస్ ఫుల్ ఫార్ములాతో వస్తున్నాడు. ‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో శ్రీ విష్ణు అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది.

యూత్ ఫుల్ లవ్ స్టోరీతో శ్రీ విష్ణు

యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస విజయాలతో నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. శ్రీ విష్ణు నటించిన సినిమాలు థియేటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అదే విధంగా ఓటీటీలో సైతం ఆకట్టుకుంటున్నాయి. చివరగా శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో పర్వాలేదనిపించే విజయం అందుకున్నాడు.

త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం అనే మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో శ్రీ విష్ణుకి జోడిగా నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఎప్పటిలాగానే శ్రీ విష్ణు తన సక్సెస్ ఫుల్ ఫార్ములా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

టీజర్లో లిప్ కిస్ సీన్ హైలైట్

టీజర్ లో శ్రీవిష్ణు మార్క్ సెటైరికల్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ చూస్తుంటే.. ఈ మూవీలో శ్రీ విష్ణు వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం పై నమ్మకం ఎక్కువగా ఉండే కుర్రాడిగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ శారీ కట్టి హోమ్లీగా కనిపిస్తున్నప్పటికీ యాటిట్యూడ్ పరంగా బోల్డ్ గా చూపిస్తున్నారు.

హీరోయిన్ తో రొమాన్స్ సందర్భంగా.. లిప్ కిస్ ఏంట్రా ఇంత యమాగా ఉంది.. ఏ కుర్ర నాయాళ్ళ లారా మీ ఆత్రం నాకు ఇప్పుడు అర్థం అయింది అంటూ శ్రీ విష్ణు చెబుతున్న డైలాగులు యువతని మెప్పించేలా ఉన్నాయి.

ఫిబ్రవరి 28న ‘విష్ణు విన్యాసం’ రిలీజ్

మొత్తంగా టీజర్ లో ఫన్ మూమెంట్స్, హీరోయిన్ పాత్ర ఆకట్టుకుంటున్నాయి. అయితే శ్రీ విష్ణు గత చిత్రాల భిన్నమైన కథతో ఏమీ రావడం లేదు. మరోసారి యూత్ ఫుల్ లవ్ స్టోరీనే నమ్ముకున్నాడు. ప్రతిసారి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

మొత్తానికి ‘విష్ణు విన్యాసం’ టీజర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. శ్రీ విష్ణు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.