|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణు విన్యాసం: విడుదల ముంగిట కలవరం.. బయ్యర్లకు దిమ్మతిరిగే షాక్!

Published: 20-02-2026, 10:05 AM
విష్ణు విన్యాసం: విడుదల ముంగిట కలవరం.. బయ్యర్లకు దిమ్మతిరిగే షాక్!
  • శ్రీ విష్ణు హీరోగా ‘విష్ణు విన్యాసం’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
  • తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.
  • డిస్ట్రిబ్యూటర్ కోట్ చేస్తున్న ధరలు చూసి బయ్యర్లు భయపడుతున్నట్లు సమాచారం.
  • హీరో మార్కెట్ రేంజ్‌ని మించి ధర ఉండటంతో బయ్యర్లు వెనక్కి తగ్గుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ధరలు బయ్యర్లను భయపెడుతున్నాయని, దీని కారణంగా పంపిణీదారులు వెనక్కి తగ్గుతున్నారని సమాచారం.

విడుదలకు సిద్ధమైన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) నటిస్తున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam). నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగి, విడుదలకు ముందే దాదాపు రూ. 7 కోట్ల లాభం నిర్మాతకు వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది. ఇదంతా బాగానే ఉంది కానీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం పంపిణీ విషయంలో బయ్యర్లు భయపడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ ధరతో బయ్యర్లలో ఆందోళన

ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఆస్ట్రేలియా వెంకట్) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ డిస్ట్రిబ్యూటర్ కోట్ చేసే ధరలు చూసి, బయ్యర్స్ అందరూ భయపడిపోతున్నారట. ఎందుకొచ్చిన సంతలే అని డ్రాప్ అవుతున్నారట. దీంతో ఈ డిస్ట్రిబ్యూటర్‌కు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడనేలా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ముందు పరుగులు పెట్టి కొనడం ఎందుకు? తీరా కొన్నాక వర్కవుట్ అవుతుందా? లేదా? అని భయపడటమెందుకు? హీరో స్టామినా ఏంటనేది చూసుకోకుండా.. సినిమా సినిమాకు అధిక ధరలు పెట్టి రైట్స్ కొనడం ఎందుకు? వాటిని బయ్యర్లపై రుద్దాలని చూడటం ఎందుకనేలా.. ట్రేడ్‌లో టాక్ నడుస్తుంది.

వెనక్కి తగ్గుతున్న బయ్యర్లు… కారణం ఇదే!

ఎవరు పోటీకి వస్తారో అని.. ముందే రైట్స్ కొనేశారు. ఇప్పుడంతా డ్రాప్ అవుతుండటంతో.. సినిమా పరిస్థితిపై కూడా డౌట్స్ వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ విష్ణుపై నమ్మకంతో ఫ్యాన్సీ ధర పెట్టాలని భావిస్తున్నా, డిస్ట్రిబ్యూటర్ కోట్ చేసే అంకెలతో వారికి భయం పట్టుకుంది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు, హీరో మార్కెట్ రేంజ్‌ని మించి అడుగుతున్నారు. ఏదో తేడా కొడుతుంది శీనా? అని భావించి బయ్యర్లు వెనక్కి తగ్గుతున్నారట. సినిమా బిజినెస్ పరంగా రేట్లు ఎక్కువ అనిపించినా, కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది. శ్రీ విష్ణు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. సినిమా విడుదలయ్యాక వచ్చే మౌత్ టాక్ పై ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి.. ఈ గందరగోళ పరిస్థితుల్లో ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విన్యాసం చేస్తుందో..

మొత్తానికి, ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ బయ్యర్ల వెనుకడుగు సినిమా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.