
నటుడు విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాల దంపతులకు కూతురు జన్మించింది. ఈ నామకరణ మహోత్సవంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పాల్గొని, శిశువుకు పేరు పెట్టారు. ఈ సంతోషకరమైన సందర్భానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Key Points
విష్ణు విశాల్-గుత్తా జ్వాల దంపతులకు కూతురు జన్మ
అమీర్ ఖాన్ నామకరణ మహోత్సవంలో పాల్గొన్నారు
ఆనందభరితమైన క్షణాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
విష్ణు విశాల్ కుటుంబం
హీరో విష్ణు విశాల్ నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. మొదటి వివాహంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉంటున్నాడు. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఈ దంపతులకు కూతురు పుట్టగా.. నామకరణ మహోత్సవానికి అతిథిగా హాజరయ్యాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. తమ కూతురికి మీరా అని పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన దంపతులు.. చాలా ఎమోషనల్ అయ్యారు. దీన్ని మరపురాని జ్ఞాపకంగా అభివర్ణించారు.
ఇక ఈ ఫొటోలలో జ్వాల ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం.. అమీర్, విశాల్ హగ్ చేసుకోవడం.. అమీర్ మీరాను ఎత్తుకోవడం.. చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం అమీర్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మహాభారత్ మూవీ మొదలు పెట్టే సన్నాహాల్లో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ‘సితారే జమీన్ పర్’తో సక్సెస్ అందుకున్నాడు అమీర్.
నామకరణ మహోత్సవం
అమీర్ ఖాన్ పాత్ర
విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాల దంపతుల కుటుంబానికి అభినందనలు. అమీర్ ఖాన్ హాజరు కావడం ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. ఈ కొత్త ప్రారంభానికి శుభాకాంక్షలు.


