
తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోల పారితోషికాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకోవాలని, రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలని సూచించారు. తన తాజా చిత్రం ‘ఆర్యన్’ విడుదల సందర్భంగా ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Key Points
విష్ణు విశాల్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.
నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఉండాలంటే ఇది అవశ్యకం అన్నారు.
ఆయన నటించి, నిర్మించిన 'ఆర్యన్' తమిళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది.
తెలుగులో 'ఆర్యన్' సినిమా నవంబర్ 7న విడుదల కాబోతోంది.
హీరోలకు విష్ణు విశాల్ కీలక సలహా
చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ ( Vishnu Vishal ). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ ( Aaryan Movie ). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది.
హీరోలకే నా సలహా మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
నిర్మాతల కోణంలో ఆలోచించాలన్న నటుడు
ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయం అప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించాడు.
విష్ణు విశాల్ ‘ఆర్యన్’ తెలుగు విడుదల
విష్ణు విశాల్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. హీరోలు నిర్మాతల కోణంలో ఆలోచించి, పారితోషికాలు తగ్గించుకుంటే సినిమా నాణ్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయం. ఇది భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో చూడాలి.


