
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ ‘ఇరందు వానం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రమని, లోతైన భావోద్వేగ ప్రేమకథ అని విష్ణు విశాల్ తెలిపారు.
Key Points
విష్ణు విశాల్ నటించిన 'ఇరందు వానం' చిత్రం 2024 ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇది ఒక లోతైన భావోద్వేగాలతో కూడిన వినూత్నమైన ప్రేమకథ అని విష్ణు విశాల్ తెలిపారు.
ఈ చిత్రం తన కెరీర్‌లోని అత్యుత్తమ సినిమాలలో ఒకటి అవుతుందని విష్ణు విశాల్ ధీమా వ్యక్తం చేశారు.
విష్ణు విశాల్ తాజా చిత్రం ‘ఇరందు వానం’
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’తో మంచి హిట్ అందుకున్న విష్ణు విశాల్ (Vishnu Vishal)ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలను లైన్‌లో పెట్టి బిజీ బిజీ షెడ్యూల్లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఇరందువానం’ (IranduVaanam )భారీ అంచనాల మధ్య రానుంది. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న లవర్స్ డే కానుకగా రాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్.. ఈ మూవీ గురించి పలు విషయాలు పంచుకున్నారు.
‘‘ఇరందు వానం సినిమా ముఖ్య కథను నేను చెప్పలేను. కానీ దాని గురించి కొన్ని విషయాలు పంచుకోగలను. ఇది ఒక ప్రేమకథ, ఇందులో అందరూ ఆశ్చర్యపోయే ఒక ప్రత్యేక అంశం ఉంది. నేను మొదట కథ విన్నప్పుడు, దర్శకుడు రామ్‌తో – ఇలాంటిది నిజంగా జరుగుతుందా? అని అన్నాను. రెండవ భాగంలో, లోతైన భావోద్వేగ క్షణం ఉంటుంది. మా 6 గంటల కథనం సమయంలో, రామ్ ఆ సన్నివేశాన్ని చెప్పినప్పుడు అతను కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇది ఖచ్చితంగా నా కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు.
‘ఇరందు వానం’ కథా నేపథ్యం
విష్ణు విశాల్ కెరీర్‌లో బెస్ట్?
‘ఇరందు వానం’ ఒక ప్రత్యేక ప్రేమకథ అని, ఇందులో దర్శకుడు రామ్ కుమార్ ఓ వినూత్న అంశాన్ని పొందుపరిచారని విష్ణు విశాల్ పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


