
📌 Key Points
- ఫరియా అబ్దుల్లా హైట్ పై విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్.
- దర్శకుడు విశ్వక్ సేన్ గతంలో తిరువీర్‌కు అవకాశం ఇవ్వలేకపోయారు.
- భగవంతుడు సినిమాలో తిరువీర్ బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
- టీజర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్, విశ్వక్ సేన్ పాల్గొన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫరియా అబ్దుల్లా హైట్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘భగవంతుడు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫరియా హైట్ పై విశ్వక్ సేన్ కామెంట్స్
Vishwaksen: ఒకవైపు డైరెక్టర్ గా.. మరొకవైపు హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు తాను హీరోగా నటించిన ‘ఫంకీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈయన.. మరొకవైపు ‘ ఈ నగరానికి ఏమైంది?2’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఒకవైపు అలా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తాజాగా తిరువీర్ (Thiruveer) హీరోగా నటిస్తున్న ‘భగవంతుడు’ సినిమా నుండి ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా ..ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్ తో పాటు విశ్వక్ సేన్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా హైట్ గురించి విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఏంటి.. భయ్యా ఇలా అన్నావ్.. అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వేదికపై విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. తిరువీరు నేను దర్శకత్వం వహించిన ఫలక్ నుమా దాస్ సినిమాలో హీరోగా చేయాల్సిన వాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల కుదరలేదు అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు విశ్వక్ సేన్..
ఫలక్ నుమా దాస్ లో తిరువీర్ ఛాన్స్ మిస్
ఇక ఫరియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను భవిష్యత్తులో సిజి ఇంకా డెవలప్ అయిన తర్వాత ఆమెతో కలిసి సినిమా చేద్దామని ఆగాను అంటూ ఆమె హైట్ ని సరిపోలుస్తూ కామెంట్ చేశారు విశ్వక్ సేన్. ఇక దీంతో అరే ఏంటి భయ్యా ఇలా అన్నావ్ అని కామెంట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇదంతా జోక్ చేస్తున్నాను అంటూ తెలిపారు. మొత్తానికైతే ఆమె హైట్ పై విశ్వక్ సేన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భగవంతుడు టీజర్ లాంచ్ ఈవెంట్
ఇక భగవంతుడు సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు జార్జిరెడ్డి, టక్ జగదీష్ , పలాస వంటి చిత్రాలలో సహాయ నటుడిగా ఆకట్టుకున్న తిరువీర్.. పరేషాన్ , మసూద, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాలతో హీరోగా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎక్కువగా అమాయకుడి తరహా పాత్రలతోనే ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు తొలిసారి ఒక బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అదే భగవంతుడు సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 90వ దశాబ్దంలో పల్నాడు ప్రాంతాన్ని బేస్ చేసుకుని మేకర్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో దీనిని తెరకెక్కించారు. టైటిల్ కి తగ్గట్టుగానే పల్లెటూర్లలో ఆచారాలు, దేవుడంటే నమ్మకం తదితర అంశాలతో ఈ సినిమాను తీసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక తిరువీర్ సరసన ప్రముఖ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. ఇక రిషి విలన్ పాత్ర పోషిస్తున్నారు ఈ వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం.. మొత్తానికైతే జాతి రత్నాలు సినిమా తర్వాత మరోసారి భగవంతుడు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫరియా అబ్దుల్లాకి ఎలాంటి విజయం లభిస్తుందో చూడాలి.
మొత్తానికి ఫరియా హైట్ పై విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది కేవలం సరదాగా చేసిన వ్యాఖ్య అని ఆయన తెలిపారు. భగవంతుడు సినిమాలో తిరువీర్ కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు.


