|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ: ఫస్ట్ రివ్యూతోనే బ్లాక్ బస్టర్ టాక్! ఇక థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

Published: 12-02-2026, 11:35 AM
విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ: ఫస్ట్ రివ్యూతోనే బ్లాక్ బస్టర్ టాక్! ఇక థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
  • ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల, యూ/ఏ సర్టిఫికెట్ పొందిన చిత్రం.
  • దర్శకుడు అనుదీప్ మార్క్ కామెడీతో సినిమా నిండిపోయింది. డైలాగ్స్ అదిరిపోతాయి!
  • విశ్వక్ సేన్, కయాదు లోహర్ లవ్ ట్రాక్ టామ్ అండ్ జెర్రీలా ఉంటుందట.
  • సినిమా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ, ముఖ్యంగా దర్శకుడి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫంకీ’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా కామెడీతో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!

ఫస్ట్ రివ్యూ: ఫంకీ మూవీ ఎలా ఉందంటే?

అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`. `జాతిరత్నాలు`తో ఆయన పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ హీరో కంటే దర్శకుడికే ఎక్కువ పేరు తెచ్చింది. దీంతో అనుదీప్‌కి ఉన్న క్రేజ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. మధ్యలో ఆయన `ప్రిన్స్‌` చిత్రం చేశారు. అది ఆడలేదు. ఇప్పుడు `ఫంకీ` చిత్రంతో వస్తున్నారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా, కయాదు లోహర్‌ హీరోయిన్‌గా చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజుని పురస్కరించుకుని శుక్రవారం(ఫిబ్రవరి 13న) విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టాక్‌, ఫస్ట్ రివ్యూ తెలిసింది. మూవీ ఎలా ఉండబోతుందో తెలిసింది. సినిమా ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు/ ఏ సర్టిఫికెట్‌ని పొందింది.  ఏడేళ్లకుపై వయసున్న వారు మూవీని చూడొచ్చు. సినిమా రెండు గంటల ఎనిమిది నిమిషాల నిడివితో ఉంటుందట. చాలా షార్ట్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. చిత్ర బృందం మాత్రం కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తోంది. చూస్తున్నంత సేపు నవ్వుకుంటారని, లాజిక్‌లు వెతకొద్దని నిర్మాత నాగవంశీ తెలిపారు. కథ గురించి ఆలోచించొద్దు అన్నారు. ఐదు, పది నిమిషాలకు కామెడీ సీన్లు ఉంటాయని ఆద్యంతం నవ్వులు పూయిస్తాయని చెప్పారు.

విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ అదుర్స్!

ఇక ఈ మూవీని ఇప్పటికే కొంత మందికి చూపించారు. మరి వారి నుంచి వస్తోన్న టాక్‌ ప్రకారం మూవీకి హిట్‌ అవకాశాలున్నాయట. ఇది సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ. ముఖ్యంగా దర్శకుడి పాత్ర చుట్టూ సాగుతుందట. అతను తన అసిస్టెంట్లతో, టీమ్‌తో చేసే కన్వర్జేషన్‌ ఫన్నీగా నవ్వులు పూయించేలా ఉంటుందట. ఆయన ప్రశ్నలు, వాళ్ల సమాధానాలు, దీనికి ఆయన ఇచ్చే కౌంటర్‌ నవ్విస్తుందట. సినిమా మొత్తం డైలాగ్‌ కామెడీతో సాగుతుందట. అదే సమయంలో సినిమాలకు సంబంధించిన విషయాలను, వారి ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్స్ ని ఇందులో చూపించారట. ఫ్యామిలీ అంశాలు కట్టిపడేసేలా ఉంటాయట.

హీరో ఎంట్రీ చాలా ఫన్నీగా ఉంటుందని, తన బ్యాచ్‌తో కన్వర్జేషన్‌ నవ్విస్తుందని, హీరోయిన్‌తో సీన్లు కూడా ఫన్నీగా ఉంటాయని, లవ్‌ స్టోరీగా నవ్వించేలా ఉంటుందట. హీరోహీరోయిన్ల మధ్య కన్వర్జేషన్‌ టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటుందట. చివరికి వీరిద్దరే ప్రేమలో పడతారని, ఆయా సీన్లని కూడా కామెడీగా నడిపించాడట దర్శకుడు. పూర్తిగా అనుదీప్‌ స్టయిల్‌లో మూవీ ఉంటుందని సమాచారం. విశ్వక్‌ సేన్‌, ఆయన టీమ్‌తోపాటు సీనియర్‌ నరేష్‌, సంపత్‌ రాజ్‌, మురళీ ధర్‌ గౌడ్‌ పాత్రలు ఆద్యంతం ఫన్నీగా ఉంటాయని అంటున్నారు.

థియేటర్లలో నవ్వులే నవ్వులు!

ఇవన్నీ ఓ ఎత్తైతే ఇందులో కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట. నిర్మాత నాగవంశీ, దిల్‌ రాజు, హరీష్‌ శంకర్‌ వంటి దర్శకులు, నిర్మాతలు ఇందులో మెరుస్తారట. ఆయా సీన్లు హిలేరియస్‌గా ఉంటాయని సమాచారం. దీంతోపాటు సినిమాలు తీయడంలో బడ్జెట్‌ ఎలా పెరిగిపోతుంది, మొదట చెప్పింది ఒక్కటి, తర్వాత తీసింది ఒకటి ఇలా ఉంటాయని, ఇలా సెటైర్స్ చాలా ఉంటాయని, అవి ఆద్యంతం నవ్వులు పూయిస్తాయని అంటున్నారు. చివర్లో ఎమోషనల్‌ సీన్లు కూడా ఉంటాయని అంటున్నారు.

ఇక సినిమాకి ఉన్న పెద్ద మైనస్‌ ఏంటంటే దీనికి బజ్‌ రావడం లేదు. మంచి కాస్టింగ్‌ ఉంది, టీజర్‌, ట్రైలర్‌ నవ్వించాయి. కానీ హైప్‌ రావడం లేదు. ఆడియెన్స్ సినిమాలు చూసే మూడ్‌లో లేరు. దీనికితోడు విశ్వక్‌ సేన్‌కి ఇప్పుడు క్రేజ్‌ లేదు. అనుదీప్‌ చివరి మూవీ కూడా ఆడలేదు. నాగవంశీకి కూడా అంతటి క్రేజ్‌ లేదు. ఇవన్నీ మూవీపై ప్రభావం చూపిస్తున్నాయి. బజ్‌ రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా థియేటర్లలో నిరూపించుకున్న తర్వాతనే ఆడియెన్స్ కి రీచ్‌ అవుతుందని చెప్పొచ్చు. పూర్తిగా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే ఆడియెన్స్ థియేటర్‌కి వస్తారు. లేదంటే కష్టమనే చెప్పొచ్చు. సినిమా హిట్‌ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే. అలాగే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఏసియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

ఫంకీ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.