
📌 Key Points
- ఫిబ్రవరి 13న విడుదలైన ‘ఫంకీ’ మూవీతో విశ్వక్సేన్ సందడి!
- సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై గ్రాండ్ రిలీజ్!
- హైదరాబాద్ ఫ్రెండ్షిప్ గురించి విశ్వక్సేన్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
- బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ప్రజల సహాయ గుణం గొప్పదని విశ్వక్సేన్ ప్రశంసలు!!
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరోసారి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ రిలీజ్!
టాలీవుడ్ యువ నటుడు మాస్ కా దాస్ విశ్వక్సేన్ తాజాగా ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాయదు లోహర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, వీకే నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్ కేవీ, కల్యాణ్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఫిబ్రవరి 13వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ కామెడీ ఎంటర్టైనర్ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. తాజాగా విశ్వక్సేన్ తన అభిమానులతో మీట్ అయ్యాడు.
హైదరాబాద్ ఫ్రెండ్షిప్ గురించి విశ్వక్ కామెంట్స్ వైరల్!
అందులో భాగంగా హైదరాబాద్‌లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? అక్కడ నివసించే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే దానిపై ఫన్నీగా చెప్పుకొచ్చాడు. తాజాగా విశ్వక్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఫ్రెండ్షిప్ సూపర్ గా ఉంటుంది. ఏ ఫ్రెండ్ కైనా ఫోన్ చేసి బయటికి రారా అంటే, వాడు ఇంకో మాట అడగకుండా బయటికి వస్తాడు. బండిపై కూర్చుంటాడు, అలా వెళ్తూనే ఉంటాము. బైక్ స్టార్ట్ అయినా ఓ పది నిమిషాలకు ఎక్కడికి వెళ్తున్నాం మామ అని అడుగుతాడు. అంత సేపు ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా తెలియకుండా వాడు మనతో పాటు వచ్చేస్తుంటాడు, అక్కడ ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది.
బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ గొప్పదనం!
ఇక హైదరాబాద్‌లో నివసించే మనుషుల మెంటాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది. ఏదైనా ప్రాంతంలో ఉండి అడ్రస్ కన్ఫ్యూజ్ అయినట్లయితే, ఎవరినైనా ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే, వారు కొంతసేపు అడ్రస్ చెప్పడానికి ప్రయత్నించి, ఆ తర్వాత నేనే బండిపై వస్తా చూపిస్తా పద అంటారు. అదే బెంగళూరు లాంటి సిటీలో అయితే, మనతో మాట్లాడే సమయంలో వారు ఏదైనా పని చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు అని మనల్ని అస్సలు పట్టించుకోరు. ఇలా హైదరాబాద్ పీపుల్ చాలా సరదాగా, ఫన్నీగా ఉంటారు అని విశ్వక్ చెప్పుకొచ్చాడు.
విశ్వక్సేన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


