|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: దేవర బ్యానర్లో విశ్వక్ సేన్ మూవీ..ఫ్లాప్ డైరెక్టరే ఫిక్స్..ఎన్టీఆర్ కూడా ఇన్వాల్వ్?

Published: 18-02-2026, 2:05 AM
షాకింగ్: దేవర బ్యానర్లో విశ్వక్ సేన్ మూవీ..ఫ్లాప్ డైరెక్టరే ఫిక్స్..ఎన్టీఆర్ కూడా ఇన్వాల్వ్?
  • విశ్వక్ సేన్ కెరీర్ లో మరో భారీ చిత్రం: దేవర బ్యానర్ లో అవకాశం!
  • ఎన్టీఆర్ ఆజ్ఞతో నిర్మాత సుధాకర్ మిక్కిలినేని భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు!
  • తమిళ దర్శకుడు రజత్ దర్శకత్వంలో విశ్వక్ కొత్త సినిమా: గతంలో భారీ డిజాస్టర్!
  • దేవ్ సినిమా దర్శకుడితో విశ్వక్ సినిమానా? అభిమానుల్లో నిరాశ, సినిమా భవితవ్యంపై సందేహాలు!

విశ్వక్ సేన్ కెరీర్ లో ఊహించని మార్పులు! దేవర వంటి భారీ చిత్రం నిర్మించిన బ్యానర్ లో అవకాశం రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

దేవర బ్యానర్లో విశ్వక్ సేన్ సినిమా!

Vishwak Sen: విశ్వక్ సేన్ టైం ఏంటో అస్సలు బాలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ, హిట్స్ మాత్రం పడటం లేదు. గత ఏడాది లైలా సినిమాతో కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అందుకున్నాడు ఈ హీరో. ఆ దెబ్బతో ఏడాది పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దర్శకుడు అనుదీప్ తో ఫంకీ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. కామెడీ బాగానే వర్కౌట్ అయినా కథ చాలా సిల్లీ గా ఉంది అంటూ ఆడియన్స్ ఫీలయ్యారు. దాంతో, ఫంకీ సినిమా కూడా తాను అనుకున్న రిజల్ట్ ను విశ్వక్ కి అందించలేదు. ఈనేపథ్యంలో విశ్వక్ సేన్(Vishwak Sen) నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్లాప్ డైరెక్టర్ తో విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

అదేంటి అంటే, దేవర సినిమా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని విశ్వక్ సేన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడట. ఆ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆజ్ఞతో సుధాకర్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. ఏ ఈ ప్రెజెక్టు కోసం తమిళ దర్శకుడు రజత్ చెప్పిన కథను ఒకే చేశారట. రజత్ గతంలో కార్తీ హీరోగా వచ్చిన దేవ్ సినిమాను చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదు.

ఎన్టీఆర్ జోక్యంతోనే ఈ సినిమా సాధ్యమైందా?

అంతలా డిజాస్టర్ అయ్యింది ఈ సినిమా. రీసెంట్ గా రజత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో విశ్వక్ కూడా ఈ సినిమా చేసేందుకు ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ ప్రెజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, దేవర లాంటి సినిమా చేసిన నిర్మాతకు అంతకన్నా వేరే దర్శకుడు దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకంటాడు అనేది చూడాలి.

దేవర బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.