
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం జూలై 10, 2026న విడుదల కానుంది.
- విజువల్ ఎఫెక్ట్స్ కోసం చిరంజీవి స్వయంగా సమయం తీసుకున్నారు.
- కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ తీసిన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
- చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ జూలై 10, 2026న విడుదల కానుంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.
విశ్వంభర విడుదల తేదీ ఖరారు
Vishwambhara:టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఇటీవల వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీపై ఒక స్పష్టత రావడంతో సోషల్ మీడియాలో మెగా సందడి మొదలైంది. వివరాలలోకి వెళితే..
ఇక తాజా సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ చిత్రాన్ని జులై 10, 2026న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ముందే రావాల్సి ఉన్నప్పటికీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం చిరంజీవి స్వయంగా మరికొంత సమయం తీసుకున్నారు.
కళ్యాణ్ రామ్ తో బింబిసార మూవీ చేసి భారీ సక్సెస్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ ఆ తరువాత ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలి మీడియా ఇంటరాక్షన్లలో చిరంజీవి సైతం సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతోందని, జులైలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని హింట్ ఇచ్చారు చిరంజీవి.
విజువల్ వండర్‌గా ‘విశ్వంభర’
ఇక చిరంజీవి తాజాగా సంక్రాంతికి సూపర్ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్‌గారు మూవీతో మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఇంకా మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ నుండి వస్తున్న ‘విశ్వంభర’ పైన భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన చాలా కాలం తర్వాత త్రిష నటిస్తుండటం విశేషం.
వీరిద్దరి కాంబినేషన్ గతంలో ‘స్టాలిన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అలాగే ఆశికా రంగనాథ్, ఈశా చావ్లా వంటి నటీమణులు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో, పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఫాంటసీ కథకు ప్రాణం పోస్తాయని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్‌గా నిలవబోతోంది. పైగా అప్పట్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సోషియో ఫాంటసీ చిత్రాల తర్వాత చిరంజీవి మళ్ళీ ఆ తరహా జోనర్‌లో నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జులై 10న థియేటర్లలో ‘విశ్వంభర’ సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి.
చిరంజీవి, త్రిష కాంబినేషన్
ప్రస్తుతం చిరంజీవి బాబి కొల్లి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు బాబి కొల్లి చిరంజీవిని బెంగాల్ మాఫియా డాన్ గా చూపించబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్! #Chiranjeevi #Vishwambhara #MallidiVassishta #Tollywood #BIGTVCinema @KChiruTweets pic.twitter.com/oarsnBWqCb
— BIG TV Cinema (@BigtvCinema) January 29, 2026
చిరంజీవి కెరీర్‌లోనే ఒక ప్రత్యేక చిత్రంగా ‘విశ్వంభర’ నిలుస్తుందని భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


