
📌 Key Points
- వివో S60 5G మే 29న చైనాలో లాంచ్ కానుంది.
- 7200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యం.
- బ్యాటరీ సేవింగ్ కోసం మైక్రో ఎలక్ట్రిక్ విజార్డ్ 2.0 ఫీచర్.
వివో S60 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. భారీ 7200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ టెన్షన్‌కు గుడ్‌బై చెప్పనుంది. మే 29న చైనాలో లాంచ్ కానున్న ఈ ఫోన్ వివరాలు తెలుసుకుందాం.
వివో S60 5G: లాంచ్ వివరాలు, కలర్ ఆప్షన్లు
Vivo S60 5G Launch : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో వివో 5జీ ఫోన్ రాబోతుంది. వివో S60 5జీ ఫోన్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. వచ్చే వారం చైనాలో వివో టీడబ్ల్యూఎస్ 5eతో పాటు ఆవిష్కరించనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ అయిన వివో S50 ప్లేసులో ఈ కొత్త ఫోన్ రానుంది.
రాబోయే S సిరీస్ ఫోన్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇంగ్రెస్ ప్రొటెక్షన్ (IP) రేటింగ్ వంటి అనేక వివరాలు రివీల్ అయ్యాయి. కంపెనీ ఈ వివో ఫోన్ లాంచ్ తేదీని కూడా ధృవీకరించింది. డిజైన్‌కు సంబంధించి ఫొటోను కూడా షేర్ చేసింది. కొత్త వివో S60 ఫోన్ దేశీయ మార్కెట్లో 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ చెబుతోంది.
వివో S60 కలర్ ఆప్షన్లు : చైనాలో వివో S60 ఫోన్ ఎర్లీ సమ్మర్ గ్రీన్, మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్, సీ ఆఫ్ స్టార్స్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ లేటెస్ట్ వీబో పోస్ట్‌లో వెల్లడించింది. గ్రీన్, బ్లాక్ కలర్ బ్యాక్ సైడ్ ఒకే కలర్ డిజైన్ ఉండగా, సీ ఆఫ్ స్టార్స్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌పై బ్లూ కలర్ షాడోతో పాటు స్టార్ లాంటి డిజైన్ కూడా ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: టెన్షన్ లేకుండా
Read Also : Gold Price Today May 28 : పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్! రాత్రికి రాత్రే కుప్పకూలిన తులం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే?
ఈ సరికొత్త S-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మే 29వ తేదీన చైనాలో రాత్రి 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు) లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని అంచనా.
కెమెరా, ఇతర స్పెసిఫికేషన్లు
వివో S60 స్పెసిఫికేషన్లు : స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. వివో S60లో 7,200mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. గ్లోబల్ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై 2.0కి కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్ టెంపరేచర్ కంట్రోలింగ్ చేస్తుందని అంచనా.
వివో మైక్రో ఎలక్ట్రిక్ విజార్డ్ 2.0 ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ అయిపోవడానికి కొద్ది క్షణాల ముందు బ్యాటరీ సేవ్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
వివో S60 5G తన అద్భుతమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో వినియోగదారుల అంచనాలను పెంచుతోంది. ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించడం ఖాయం.


