
📌 Key Points
- నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న నరేష్.
- ఫిబ్రవరి 20న విడుదల కానున్న ‘హే భగవాన్’ సినిమా ప్రమోషన్లలో నరేష్.
- హీరోయిన్లు చీరలు కట్టుకుని రావడంతో హగ్ చేసుకోలేకపోయానని నరేష్ కామెంట్.
- శివాజీ వివాదం గురించి పరోక్షంగా మాట్లాడిన నరేష్.
ప్రముఖ నటుడు వీకే నరేష్ తాజాగా హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హగ్ డే సందర్భంగా హీరోయిన్లను హగ్ చేసుకుందామంటే వాళ్లు చీరలు కట్టుకుని వచ్చారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హే భగవాన్ సినిమా ప్రమోషన్స్
V.K Naresh: వీకే నరేష్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ దివంగత నటి విజయనిర్మల వారసురుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ కూడా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నరేష్ త్వరలోనే హే భగవాన్ (hey bhagaean film)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20 వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో నటుడు నరేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే రావడంతో ఒక వారం మొత్తం వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు అయితే నేడు హాగ్ డే కావడంతో నరేష్ వేదికపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హగ్ డే వేడుకలో నరేష్ కామెంట్స్
ఈరోజు హగ్ డే హీరోయిన్లను హగ్ చేసుకుందాము అంటే వాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారు. హగ్ చేసుకోలేకపోతున్నాను అంటూ తెలిపారు . ఇటీవల జరిగిన ఒక సంఘటన తర్వాత స్టేజిపై హీరోయిన్లందరూ కూడా చీరలతోనే కనిపిస్తున్నారు అంటూ ఈయన పరోక్షంగా శివాజీ వివాదం గురించి మాట్లాడారు. ఇలా భారతీయ సాంప్రదాయ ప్రకారం చీర కట్టుకున్న అమ్మాయిని అబ్బాయి హగ్ చేసుకోకూడదు అందుకే నేను మిమ్మల్ని హగ్ చేసుకోలేదు మీ ఇద్దరే హగ్ చేసుకోండి అంటూ వేదికపై ఉన్న శివాని నాగారం స్రవంతి చొక్కారపు గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నరేష్ ఉంటే సినిమా హిట్టే..
వైరల్ అవుతున్న నరేష్ వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ (Naresh)చేసిన ఈ కామెంట్స్ సరదాగా చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో నరేష్ క్షణం తీరిక లేకుండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అనే నమ్మకం దర్శక నిర్మాతలలో ఉండడంతో ప్రతి ఒక్క సినిమాలో కూడా నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఫిబ్రవరి 20వ తేదీ రాబోతున్న హే భగవాన్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో శివాని నాగారం(Shivani Nagaram) సుహాస్ (Suhas)హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. వెన్నెల కిషోర్ స్రవంతి చొక్కారపు నరేష్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
మొత్తానికి నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరలో ‘హే భగవాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


