|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్: తెలుగులో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Published: 15-08-2025, 2:23 AM
వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్: తెలుగులో ఎంత వసూలు చేసిందో తెలుసా?

ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

వార్ 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85-90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

2

తెలుగు వెర్షన్ 30 కోట్ల వరకు వసూలు చేసినట్టు అంచనా.

4

అధికారిక వసూళ్ల వివరాలు ఇంకా విడుదల కాలేదు.

వార్ 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్స్

ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా తుది అంచనా ప్రకారం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది. ఇండియాలో వార్ 2 కలెక్షన్స్ ఎంత..? ఎన్టీఆర్ ప్రభావంతో తెలుగు లో భారీగా వసూలు చేసిందా? ప్రపంచ వ్యాప్తంగా వార్ 2 ఎంత వసూలు చేసింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడం, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమా హైప్ చాలా భారీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం.

హిందీ వెర్షన్ (ఇండియా): 40 కోట్ల వరకు గ్రాస్

తెలుగులో వార్ 2 వసూళ్లు

తెలుగు వెర్షన్: 30 కోట్ల వరకు

ఓవర్సీస్ మార్కెట్: 15 కోట్ల వరకు

అయితే ఈసినిమాకు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇమేజ్ వల్ల, సినిమా రిలీజ్ కు ముందు నుంచే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఈ వసూళ్లకు సబంధించిన వివరాలు ఒక అంచనా మాత్రమే. వార్ 2 సినిమా నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇంత వరకూ రాలేదు. మూవీ యూనిట్ నుంచి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

అంచనాలు మరియు విశ్లేషణ

ఇక ఇదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తొలి రోజే సుమారు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.ఇదిలా ఉండగా, ఈ వారం మధ్యలో ఇండిపెండెన్స్ డే హాలిడే కావడంతో రెండు సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం వంటి వీకెండ్ డేస్ కూడా ఉండటంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన ఈసినిమాలకు కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా తన సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ సినిమా కంప్లీట్ అయిన తరువాత తారక్ వెంటనే దేవర 2 సినిమా షూటింగ్ లో జాయిన అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వార్ 2 సినిమా మొదటి రోజు వసూళ్లు భారీగానే ఉన్నాయని అంచనా. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే రోజుల్లో వసూళ్లు మరింత పెరగడానికి అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.