|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి, ఎన్ని కోట్లకు తీసుకున్నారో తెలుసా? చాలా పెద్ద రిస్క్‌

Published: 05-07-2025, 4:47 AM
`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి, ఎన్ని కోట్లకు తీసుకున్నారో తెలుసా? చాలా పెద్ద రిస్క్‌

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రం `వార్ 2` తెలుగు హక్కులు నాగవంశీ దక్కించుకున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ డీల్ ఎంత పెద్ద రిస్క్ అనేది చర్చనీయాంశం.

Key Points

1

నాగవంశీ `వార్‌ 2` తెలుగు హక్కులు దక్కించుకున్నారు.

2

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.

4

నాగవంశీ `అరవింద సమేత`, `దేవర` తర్వాత `వార్‌ 2`తో హ్యాట్రిక్‌

`వార్‌ 2` తెలుగు హక్కులు నాగవంశీకి

ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ నటించిన తొలి చిత్రం `వార్‌ 2`. హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది.

తాజాగా ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌పై పాటని చిత్రీకరిస్తున్నారు. ముంబయిలో ఈ షూట్‌ జరుగుతుంది. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఇందులో ఎన్టీఆర్‌తోపాటు హృతిక్‌ కూడా డాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇండియన్‌ మూవీస్‌లోనే చూడనటువంటి పాట ఇది అని, `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని నాటు నాటుని మించి ప్లాన్‌ దీన్ని చేస్తున్నట్టు సమాచారం. డాన్సులు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న `వార్‌ 2` చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాష్‌రాజ్‌ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోన్న చిత్రమిది.

ఇటీవలే ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేశారు. భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా మూవీ రూపొందుతుందని ఈ టీజర్‌ చూస్తే అర్థమయ్యింది. ఇందులో `రా` ఏజెంట్‌గా ఎన్టీఆర్‌ కనిపిస్తున్నారు.

హృతిక్‌ రోషన్‌ మాజీ ఏజెంట్‌గా కనిపించారు. హృతిక్‌ `రా`ని వదిలేసి నెగటివ్‌ యాక్టివిటీస్‌ చేస్తున్న నేపథ్యంలో  ఆయన్ని ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్‌ రంగంలోకి దిగడం, వీరిద్దరి మధ్య పోరాటాలే మూవీ కథ అని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ కలిసి నటిస్తున్నారు

విడుదలైన `వార్‌ 2` టీజర్‌ అంచనాలను అమాంతం పెంచేసింది. యాక్షన్‌ ఎపిసోడ్లు అదిరిపోయాయి. తారక్‌, హృతిక్‌ ఢీ అంటే ఢీ అనే సీన్లు వాహ్‌ అనిపించాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి.

అది సినిమా బిజినెస్‌పై భారీ హైప్‌ని పెంచేసింది. ఈ మూవీ బిజినెస్‌ లెక్కలు ఇప్పుడు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో `వార్‌ 2` తెలుగు రైట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకోవడం విశేషం.

తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ నటించిన మూడు సినిమాలను వరుసగా విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నాగవంశీ.

గతంలో `అరవింద సమేత`, ఆ తర్వాత `దేవర` చిత్రాన్ని ఆయనే విడుదల చేశారు. ఇప్పుడు `వార్‌ 2`ని తెలంగాణ, ఆంధ్రాలో ఆయనే విడుదల చేయబోతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టబోతున్నట్టు తెలిపారు.

Yes… it’s #War2 …Couldn’t be happier to reunite with my dearest @tarak9999 anna ❤️ After #AravindhaSametha and #Devara , it’s time for the hattrick and we are going all in no matter what 💥💥 Dear fans… get ready! You are going to witness the man of masses like NEVER before….… pic.twitter.com/1ETM7iJVGM

— Naga Vamsi (@vamsi84) July 5, 2025

సినిమాపై భారీ అంచనాలు

అయితే ఈ తెలుగు రైట్స్ ఇప్పుడు షాకిస్తున్నాయి. నాగవంశీ ఏకంగా రూ.80కోట్లు పెట్టి నైజాం, ఆంధ్రా థియేట్రికల్‌ రైట్స్‌ దక్కించుకున్నట్టు సమాచారం.

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ వాళ్లు వంద కోట్లు డిమాండ్‌ చేశారని, ఎనభై కోట్ల వరకు సెట్‌ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వాస్తవంగా ఈ అమౌంట్‌ కంటే ఎక్కువ రేట్‌కే నాగవంశీ `వార్‌ 2` తెలుగు రైట్స్ తీసుకున్నట్టు లేటెస్ట్ సమాచారం.

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఎనబై కోట్లు అంటే ఇది ఏకంగా తెలుగులో రూ.160కోట్లు వసూలు చేయాలి. మరి అది సాధ్యమవుతుందా? అనేది బిగ్‌ క్వచ్చన్‌. నాగవంశీ చాలా పెద్ద రిస్కే చేస్తున్నారని చెప్పొచ్చు.

మన తెలుగు మార్కెట్‌లో బాలీవుడ్‌ చిత్రాలు ఎప్పుడూ భారీ వసూళ్లని రాబట్టలేదు. ఏ మూవీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఇందులో ఎన్టీఆర్‌ ఉండటంతో అది కలిసి వచ్చే అంశం. దానివల్లే ఇంత డిమాండ్‌ అనేది అందరికి తెలిసిందే.

కానీ సబ్జెక్ట్ పరంగా ఇది మన తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? ఇలాంటి యాక్షన్‌ మూవీస్‌ని మన ఆడియెన్స్ చూస్తారా? అనేది పెద్ద ప్రశ్న. దీనికితోడు సౌత్‌లో `కూలీ` మూవీ కూడా అదే రోజు విడుదల కానుంది.

రజనీకాంత్‌, నాగార్జున వంటి భారీ కాస్టింగ్‌ ఇందులో ఉంది. ఇది తెలుగుకి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. కావున ఇంతటి పోటీ మధ్య `వార్‌ 2` తెలుగు హక్కులను ఇంతటి భారీ అమౌంట్‌కి కొనడం విషయంలోనే నాగవంశీ రిస్క్ చేశారని చెప్పొచ్చు. ఇక ఈ మూవీని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదల కానుంది.

ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలను వరుసగా విడుదల చేస్తున్నందుకు నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. `వార్ 2` విడుదలతో ఆయన హ్యాట్రిక్ కొట్టనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.