|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వార్-2 నష్టాలపై షాకింగ్ నిజం: నాగవంశీ దేశం విడిచి పారిపోయాడా?

Published: 26-12-2025, 1:11 AM
వార్-2 నష్టాలపై షాకింగ్ నిజం: నాగవంశీ దేశం విడిచి పారిపోయాడా?
  • హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘వార్-2’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
  • తెలుగు రైట్స్ కొన్న నాగవంశీ రూ.50 కోట్లు నష్టపోయి, దేశం విడిచి పారిపోయాడని పుకార్లు వచ్చాయి.
  • నాగవంశీ స్పందిస్తూ, తాను రూ.68 కోట్లకు రైట్స్ దక్కించుకుని రూ.40 కోట్ల షేర్ వచ్చిందని చెప్పారు.
  • యశ్‌రాజ్ ఫిల్మ్స్ తనకు రూ.18 కోట్లు తిరిగి ఇవ్వడంతో ఎలాంటి నష్టం రాలేదని నాగవంశీ వివరించారు.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్-2’ డిజాస్టర్ కావడంతో, నిర్మాత నాగవంశీ భారీ నష్టాలు చవిచూశారని, దేశం విడిచి పారిపోయాడని పుకార్లు వ్యాపించాయి. తాజాగా ఆయన ఈ వార్తలపై స్పందిస్తూ, అసలు నిజాలు వెల్లడించారు.

వార్-2 డిజాస్టర్: నిర్మాతకు భారీ నష్టాలు?

హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) కాంబోలో వచ్చిన సినిమా ‘వార్-2’. ఇందులో కియారా అద్వానీ,అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా.. విమర్శలు ఎదుర్కొంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా కొందరు కావాలనే ట్రోలింగ్ చేశారు. పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఇక తెలుగు రైట్స్‌ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు.

ఈ సినిమా డిజాస్టర్‌గా మిలిగిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడటని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన నష్టాల రావడం వల్ల దేశం వదిలి పారిపోయారనే పుకార్లు కూడా వస్తున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ (Nagavamsi)ఈ విషయాలపై స్పందిస్తూ.. ‘‘వార్-2 సినిమా వల్ల నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్ రూ. 68కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్ అయ్యేసరిగి రూ. 40 కోట్ల వరకు షేర్ వచ్చింది. అయితే యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. ‘వార్-2’ వల్ల నేను నష్టపోలేదు నా డబ్బు నాకు దక్కింది’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుకార్లకు చెక్: నాగవంశీ సంచలన వివరణ

యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిజాయితీ: తిరిగి ఇచ్చిన డబ్బు

వార్-2 సినిమాపై వ్యాపించిన అపోహలకు నాగవంశీ తన వివరణతో తెరదించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిజాయితీతో వ్యవహరించి డబ్బు తిరిగి ఇవ్వడంతో, తనకు ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టం చేశారు. ఈ క్లారిటీతో పుకార్లకు చెక్ పడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.