|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

War 2 OTT: ఓటీటీలోకి వస్తున్న వార్ 2.. రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Published: 04-10-2025, 11:03 PM
War 2 OTT: ఓటీటీలోకి వస్తున్న వార్ 2.. రిలీజ్ డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా థియేటర్లలో ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది, ఓటీటీ రిలీజ్ డేట్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదలైంది.

2

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.250 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది.

4

అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన రాలేదు.

వార్ 2: థియేటర్లలో నిరాశ

War 2 OTT: బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్, మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, విడుదల తరువాత మాత్రం ఆడియన్స్ మెప్పించలేకపోయింది ఈ సినిమా. దాంతో, ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. దాదాపు రూ.500 (War 2 OTT)కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.250 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్, హ్రితిక్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు.

ఓటీటీ హక్కులు ఎవరికి?

Rashmika Mandanna: ‘నాకు తెలుసు మీరంతా..’ ఎంగేజ్ మెంట్ తరువాత రష్మిక తొలి పోస్ట్.. క్లారిటీ ఇచ్చేసింది!

ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఇదిలా ఉంటే.. తాజాగా వార్ 2 ఓటీటీ విడుదలపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, థియేట్రికల్ టూ డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ సినిమాలు 4 వారాల్లో ఓటీటీ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే వార్ 2 సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ అయినా వార్ 2 సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన వార్ 2 ఓటీటీ విడుదలపై ప్రస్తుతం ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.