
జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఇవాళ విడుదలైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో తెలుసుకుందాం. హృతిక్ రోషన్ దేశద్రోహిగా, జూనియర్ ఎన్టీఆర్ గూఢచారిగా నటించారు.
Key Points
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అద్భుతం.
స్పై యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి.
వర్సెస్ కాదు, బ్రొమాన్స్ అనేదే ట్విస్ట్.
కథాంశం: దేశద్రోహి మరియు గూఢచర్యం
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ , అనిల్ కపూర్, అశుతోష్ రానా, బాబీ డియోల్, శార్వరి వాఘ్, దిశా సెహగల్ తదితరులు
సంగీతం: ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
రిలీజ్ డేట్: ఆగస్ట్ 14, 2025
బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసిన వార్ 2 ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి వార్ 2 రివ్యూ లో తెలుసుకుందాం.
నటన మరియు యాక్షన్
ఇండియన్ రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశ ద్రోహిగా మారుతాడు. అజ్ఞాతంలో ఉంటూ కాంట్రాక్ట్ కిల్లర్‌గా హత్యలు చేస్తుంటాడు. కొన్ని దేశాలు కలిసి కలి కార్టెల్‌గా ఏర్పడి భారత్‌ను పతనం చేయాలనుకుంటాయి. అందుకు దేశ ద్రోహిగా మారిన కబీర్‌తో డీల్ కుదుర్చుకుంటాయి. ఇందులో భాగంగా రా విభాగానికి చీఫ్ కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రానా)ను కబీర్ చంపుతాడు.
కబీర్‌ను పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ ( అనిల్ కపూర్ ), ఇండియన్ గవర్నమెంట్ కలిసి సోల్జర్ విక్రమ్ చలపతిని (జూనియర్ ఎన్టీఆర్) నియమిస్తాయి. విక్రమ్ టీమ్‌లో వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా ఉంటుంది.
మరి విక్రమ్ టీమ్ కబీర్‌ను పట్టుకుందా? కలి కార్టెల్‌ను ఎవరు నడిపిస్తున్నారు? కావ్యకు కబీర్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? కావ్యకు కబీర్ చేసిన అన్యాయం ఏంటీ? అసలు సునీల్ లూథ్రాను తాను నమ్మిన బంటు అయిన కబీర్ ఎందుకు చంపాడు? అనే విషయాలు తెలియాలంటే వార్ 2 చూడాల్సిందే.
వార్ 2 ప్రమోషన్స్ చూసినప్పటి నుంచి హృతిక్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా సాగింది. కానీ, ఫస్టాఫ్ కబీర్‌ను పట్టుకునేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు అలానే అనిపించిన ఇంటర్వెల్ వచ్చేసరికి అతిపెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. కథ మొత్తం మారిపోయి కబీర్ వర్సెస్ విక్రమ్ కాదు.. ఇద్దరి మధ్య బ్రొమాన్స్ అని తేలుతుంది.
కబీర్‌ను పట్టుకునే సమయంలో విక్రమ్‌తో వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అయితే, ఇన్నిరోజులు హృతిక్, తారక్ ఇద్దరిలో ఎవరు హీరో, ఎవరు విలన్ అనే చర్చ జోరుగా సాగింది. కానీ, వార్ 2 సినిమా ప్రారంభం నుంచి ఇద్దరు హీరోలు అన్నట్లుగానే చూపించారు. ఇద్దరు హీరోల ఎంట్రీ హైలెట్‌గా ఉన్నాయి.
చివరి మాట: సర్‌ప్రైజ్ ఎలిమెంట్
కబీర్, విక్రమ్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక సెకండాఫ్‌లో ఇద్దరు కలిసి చేసే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది. అలాగే, సలామ్ పాటలో హృతిక్, తారక్ డ్యాన్స్ కనులవిందుగా ఉంటుంది. ఇక హృతిక్‌తో కియారా లవ్ ట్రాక్, కెమిస్ట్రీ బాగుంది. కియారా తన గ్లామర్‌తో హాట్ ట్రీట్ అందించింది.
అయితే, స్టైలిష్ యాక్షన్‌తో కట్టిపడేసిన వార్ 2 సినిమాలో ఎమోషన్ కొరవడింది. భావోద్వేగం బలంగా పండలేదు. పరిస్థితులకు తగినట్లుగా పర్వాలేదనిపించింది. ఇక తెలియని శత్రువుతో చేసే పోరాటం కొంచెం మైనస్ అనిపించొచ్చు. అది మరింత థ్రిల్ల్ పంచడానికి బ్రేకులు వేసినట్లు అయింది.
ఇంటర్వెల్‌లో వచ్చే ఓ ట్విస్ట్ పెద్ద మలుపు తీసుకుంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక చివరిలో ఆల్ఫా అని వచ్చే టీమ్ ట్విస్ట్ ఉంటుంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో అప్‌కమింగ్ సినిమాలపై హింట్ ఇచ్చినట్లుగా ఉంది. అక్కడక్కడ వీఎఫ్ఎక్స్ బాగాలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. అయాన్ ముఖర్జీ టేకింగ్ బాగుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే యాక్షన్ లవర్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చే వార్ 2.
మొత్తం మీద, వార్ 2 అద్భుతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్. జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ల నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథలోని ట్విస్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.


