
📌 Key Points
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ ద్వారా మెసేజ్‌లు 15 నిమిషాల్లో ఆటో డిలీట్ అవుతాయి.
- ఈ ఫీచర్ ‘ఆఫ్టర్ రీడింగ్’ పేరుతో అందుబాటులోకి రానుంది, మెసేజ్ చదవగానే మాయం చేస్తుంది.
- ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం వంటి ముఖ్యమైన టెక్స్ట్‌ల ప్రైవసీ కోసం ఇది ఉపయోగపడుతుంది.
- రీడ్ రిసీప్ట్‌లు ఆఫ్ చేసినా, ఈ ఫీచర్ చాట్‌లకు వర్తిస్తుంది.
వాట్సాప్ యూజర్ల కోసం ఒక అదిరిపోయే ఫీచర్ రాబోతుంది! ఇకపై మీరు పంపిన మెసేజ్‌లు చదివిన 15 నిమిషాల్లోనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ఈ కొత్త ఫీచర్ ప్రైవసీ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
వాట్సాప్ కొత్త ‘ఆఫ్టర్ రీడింగ్’ ఫీచర్
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు చాట్ ప్రైవసీ కోసం చదివిన కొద్ది నిమిషాలకే మెసేజ్ డిలీట్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మెసేజ్ చదివిన 15 నిమిషాల్లోనే మెసేజ్ ఆటో డిలీట్ అయిపోతుంది.
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. అతి త్వరలో అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపిన మెసేజ్ ఆటో డిలీట్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే అది డిలీట్ చేసేవరకు అలానే కనిపిస్తుంది.
కానీ, రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మీరు పంపిన మెసేజ్ దానికి అదే 15 నిమిషాల్లో ఆటో డిలీట్ అయిపోతుంది. మెసేజ్ విషయంలో ఎక్కువగా ప్రైవసీ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫీచర్. వాట్సాప్ ఈ ఆటో డిలీట్ ఫీచర్ అతి త్వరలో రాబోతుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది.
వాట్సాప్ ‘ఆఫ్టర్ రీడింగ్’ ఫీచర్ : ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ మెసేజ్ చదివిన వెంటనే చాట్ నుంచి వెంటనే మాయమైపోతుంది. ఈ ఫీచర్‌కు ‘ఆఫ్టర్ రీడింగ్’ అని పేరు పెట్టారు. ఎవరైనా మెసేజ్‌చదివిన వెంటనే ఆటో డిలీట్ చేయొచ్చు.
15 నిమిషాల్లో ఆటో డిలీట్ – ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం వాట్సాప్ (24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులలో మెసేజ్ అదృశ్యమయ్యేలా ఆప్షన్ అందిస్తోంది. అంతకన్నా బెటర్ ప్రైవసీని అందించే ఫీచర్ ఇప్పుడు తీసుకురానుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా OTP లేదా వ్యక్తిగత సమాచారం వంటి ప్రైవసీపరమైన టెక్స్ట్‌లను ఎవరైనా చూసిన వెంటనే డిలీట్ అయ్యేలా చేయొచ్చు.
Read Also : Samsung Galaxy S25 Ultra : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
15 నిమిషాల తర్వాత ఆటో డిలీట్ : మీరు మెసేజ్‌లను చదివిన 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ యూజర్ మెసేజ్ ఓపెన్ చేయకపోతే చదవని మెసేజ్ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మీరు రీడ్ రిసీప్ట్‌లను (బ్లూ టిక్స్) ఆఫ్ చేసినప్పటికీ కూడా చాట్‌లకు వర్తిస్తుంది.
ప్రైవసీకి మరింత భద్రత!
మీరు ఎవరికైనా టెంపరరీగా ఏదైనా మెసేజ్ పంపాలంటే ఈ వాట్సాప్ ఫీచర్ బెస్ట్. ఎవరి చాట్ అయినా మెసేజ్ అవసరం లేదంటే వెంటనే డిలీట్ చేయొచ్చు. ఎవరికైనా పాస్‌వర్డ్ లేదా OTP పంపాలా? ఈ కొత్త ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. చూసిన వెంటనే ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది.
వాట్సాప్ అన్ని చాట్స్‌కు వర్తిస్తుంది : మీరు పంపే ఫొటో లేదా వీడియో ఏదైనా వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా వర్క్ అవుతుంది. సాధారణ టెక్స్ట్ మెసేజ్‌ల కోసం కూడా వాడొచ్చు. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ను గుర్తించారు. వాట్సాప్ రెగ్యులర్ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కంపెనీ ఈ ఫీచర్ రిలీజ్ తేదీని ఇంకా రివీల్ చేయలేదు.
ఈ ఫీచర్ వాట్సాప్‌లో అన్ని చాట్స్‌కు వర్తిస్తుంది. ఒకసారి ఎనేబుల్ చేశారంటే మీ వాట్సాప్ చాట్‌లు ఎక్కువ రోజులు ఉండవు. మళ్లీ తిరిగి పొందలేరు కూడా. మీకు కావాలంటే వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు లేదంటే చాట్ ఓపెన్ చేసి మెసేజ్ కాపీ-పేస్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ తీసుకురానున్న ఈ ఆటో డిలీట్ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రతనిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం, ఓటీపీల విషయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


