
నయనతార లేడీ సూపర్‌స్టార్ బిరుదును వదులుకోగా, ఈ టైటిల్ ఇప్పుడు కన్నడ నటి రచితా రామ్‌కు దక్కింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ‘కూలీ’ సినిమాలో ఆమె నటనకు రజనీకాంత్ ప్రశంసలు కూడా అందుకున్నారు.
Key Points
నయనతార తనను 'లేడీ సూపర్‌స్టార్' అని పిలవద్దని ప్రకటించారు.
కన్నడ నటి రచితా రామ్ ఇప్పుడు 'లేడీ సూపర్‌స్టార్' బిరుదును అందుకున్నారు.
రచితా రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సినిమా గ్లింప్స్‌లో ఈ బిరుదును ప్రదర్శించారు.
'కూలీ'లో ఆమె నటనకు రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.
లేడీ సూపర్‌స్టార్ బిరుదు ఎవరికి?
లేడీ సూపర్‌స్టార్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది నయనతార. కొన్నేళ్లుగా ఆమె కోసం అభిమానులు ఆ బిరుదును వాడుతున్నారు. అయితే, కొన్ని నెలల క్రితం తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దని నయన్ ప్రకటించారు. దీంతో తదుపరి లేడీ సూపర్‌స్టార్ ఎవరనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఈ జాబితాలో సాయి పల్లవి, అనుష్క పేర్లు వినిపించగా, ఇప్పుడు ఓ ప్రముఖ నటి లేడీ సూపర్‌స్టార్ బిరుదును దక్కించుకున్నట్టు సమాచారం.
ఆ నటి మరెవరో కాదు.. ‘కూలీ’ సినిమాలో విలన్‌గా నటించి పాపులర్ అయిన కన్నడ నటి రచితా రామ్. నిన్న ఆమె తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కన్నడ సినిమాల అప్‌డేట్స్ విడుదలయ్యాయి. అందులో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ‘ల్యాండ్ లార్డ్’ సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. అందులో నటి రచితా రామ్ పేరు ముందు ‘లేడీ సూపర్‌స్టార్’ అని రాసి ఉంది.
రచితా రామ్ పుట్టినరోజు వేడుకలు
అంతేకాదు, నటి రచితా రామ్ తొలిసారిగా తన ఇంటి ముందు అభిమానులతో కలిసి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. వేడుకల తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాలుగా నేను పుట్టినరోజు జరుపుకోలేదు. నన్ను ఇష్టపడే వారితో ఆనందాన్ని పంచుకోవాలనిపించింది. అందుకే ఈసారి పుట్టినరోజు జరుపుకున్నాను’ అని చెప్పారు.
రచితా మాట్లాడుతూ ‘’ కూలీ లో నా నటన చూశాక, రజనీకాంత్ గారే ఫోన్ చేసి అభినందించడం నాకు దక్కిన గొప్ప బహుమతి. ఆయన మాటలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. ‘కూలీ’ సినిమా తర్వాత ఇతర భాషల నుంచి చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, ఎక్కువగా నెగెటివ్ పాత్రలే వస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నేను నటిస్తున్నాననే వార్త నిజమే. వివరాలు తర్వాత చెబుతాం.” అని ఆమె అన్నారు.
‘కూలీ’ సినిమా, తదుపరి ప్రాజెక్ట్‌లు
నేను రాజకీయాల్లోకి రాను. నాకు, రాజకీయాలకు సరిపడదు. సినీ పరిశ్రమలోనే బిజీగా ఉన్నాను. కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తాననేది కేవలం పుకారు మాత్రమే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది ప్రేమ వివాహం కాదు. పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇప్పుడు ముక్కు పుడక పెట్టుకోవడానికి, పెళ్లి వార్తలకు సంబంధం లేదు’ అని రచితా రామ్ చెప్పారు.
మొత్తంగా, నయనతార తర్వాత లేడీ సూపర్‌స్టార్‌గా రచితా రామ్ కొత్త గుర్తింపు పొందారు. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై చేసిన ప్రకటనలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.


