|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్‌ కళ్యాణ్‌తో అందుకే నటించలేదు, ఇప్పుడు ఛాన్స్ వస్తే.. `సుస్వాగతం` హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

Published: 27-06-2025, 9:49 PM
పవన్‌ కళ్యాణ్‌తో అందుకే నటించలేదు, ఇప్పుడు ఛాన్స్ వస్తే.. `సుస్వాగతం` హీరోయిన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం చిత్రంలో నటించిన దేవయాని, పవన్ కళ్యాణ్ తో మళ్ళీ నటించకపోవడానికి కారణాలను వెల్లడించారు. తాజాగా ఆమె నటించిన 2బీహెచ్‌కే చిత్ర ప్రచారంలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Key Points

1

సుస్వాగతం చిత్రంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లో మలుపు

2

దేవయాని సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నట్లు వెల్లడి

4

2బీహెచ్‌కే చిత్రంలో దేవయాని కీలక పాత్ర

సుస్వాగతం చిత్రం మరియు దేవయాని పాత్ర

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ప్రారంభంలో నటించిన పెద్ద హిట్‌ చిత్రాల్లో `సుస్వాగతం` ఒకటి. ఇంకా చెప్పాలంటే ఈ మూవీతోనే ఆయన విజయపరంపర స్టార్ట్ అయ్యింది. వరుసగా `తొలిప్రేమ`,`తమ్ముడు`, `బద్రి`,`ఖుషి` చిత్రాలతో విజయాలు అందుకుని టాలీవుడ్‌లో స్టార్‌ హీరో అయిపోయారు.

అత్యంత ఫాలోయింగ్‌ కలిగిన హీరోగానూ నిలిచారు. ఇక `సుస్వాగతం` చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్‌గా దేవయాని నటించింది. ప్రకాష్‌ రాజ్‌ ఆమెకి తండ్రిగా నటించాడు.

దేవయాని తెలుగులో నటించిన తొలి చిత్రం. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసి వారికి దగ్గరయ్యింది.

ఆ తర్వాత అడపాదడపా మూడు, నాలుగు సినిమాల్లో నటించింది దేవయాని. కానీ ఏది పెద్దగా హిట్‌ కాలేదు. మహేష్‌ బాబుతో `నాని` చిత్రంలో నటించింది. అయితే ఇందులో మహేష్‌ బాబుకి తల్లిగా నటించడం విశేషం.

ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కూడా `జనతా గ్యారేజ్‌`, `అరవింద సమేత వీర రాఘవ`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌, `లవ్‌ స్టోరీ`, చివరగా `దేవకీ నందన వాసుదేవ` చిత్రంలో మెరిసింది. అయితే `సుస్వాగతం` తర్వాత పవన్‌తో మళ్లీ ఆమె కలిసి నటించలేదు.

పవన్ కళ్యాణ్ తో మళ్ళీ నటించే అవకాశం

ఈ క్రమంలో తాజాగా దీనిపై స్పందించింది దేవయాని. `2బీహెచ్‌కే` చిత్రంలో ఆమె నటించింది. సిద్ధార్థ్‌ హీరోగా రూపొందిన ఈ మూవీలో దేవయాని కీలక పోషించింది. ఈ మూవీ జులై 4న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో దేవయానికి.. `సుస్వాగతం` తర్వాత మళ్లీ పవన్‌ కళ్యాణ్‌తో ఎందుకు కలిసి నటించలేదు. ఆయన్ని మళ్లీ కలిశారా? అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి దేవయాని స్పందించింది. పవన్‌ తో ఎందుకు నటించలేదో తెలిపింది.

తాను చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తున్నట్టు తెలిపింది. వచ్చిన ప్రతి సినిమా చేయడం లేదని, కథ, కథనాలు, తన పాత్రని చూసుకుని, తనకు నచ్చితేనే చేస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే తక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించింది.

అందులో భాగంగానే మళ్లీ పవన్‌ తో కలిసి నటించలేకపోయానని, అయితే ఆయనతో మళ్లీ కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని వెల్లడించింది దేవయాని. ఆయన మంచి వ్యక్తి అని, ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతి అని,

దేవయాని సినిమా ఎంపిక ప్రమాణాలు

అదొక బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని చెప్పింది దేవయాని. మంచి చిత్రాల్లోనే భాగం కావాలని అనుకుంటున్నట్టు తెలిపింది. మరి మరోసారి పవన్‌తో కలిసి నటించే అవకాశం దేవయానికి వరిస్తుందా అనేది చూడాలి.

ఇక పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ పూర్తి చేశారు.

ఇది జులై 24న విడుదల కానుంది. మరోవైపు `ఓజీ` మూవీ షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఇది సెప్టెంబర్‌లో ఆడియెన్స్ ముందుకు రానుంది. మరోవైపు ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు.

ఈ మూవీకి డేట్స్ చాలా అవసరం ఉంది. అందుకోసం కుదిరినప్పుడు అడ్జెస్ట్ చేసి ఈ మూవీ షూటింగ్‌ని కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. మరి ఇవి అయిపోయాక కొత్త సినిమాలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

దేవయాని తన సినిమా ఎంపిక చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తో మళ్ళీ నటించే అవకాశం వస్తే సంతోషంగా నటిస్తానని ఆమె వెల్లడించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.