|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భర్త త్యాగం.. భార్య ద్రోహం! ప్రభుత్వ ఉద్యోగం రాగానే ప్రియుడితో పారిపోయిన వైనం.

Published: 28-05-2026, 6:01 AM
భర్త త్యాగం.. భార్య ద్రోహం! ప్రభుత్వ ఉద్యోగం రాగానే ప్రియుడితో పారిపోయిన వైనం.
  • భార్య చదువు కోసం భర్త పూర్వీకుల భూమిని అమ్మి ఆర్థికంగా సహకరించాడు.
  • ఆమె గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందింది.
  • ఉద్యోగం వచ్చాక పాత మిత్రుడితో అనైతిక బంధం ఏర్పరచుకుంది.
  • ప్రియుడితో అద్దె ఇంట్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

బిహార్‌లో షాకింగ్ ఘటన. భార్య చదువు కోసం భూమి అమ్మి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే, ఆమె ప్రియుడితో పారిపోయింది. భర్త, కుమారుడిని వదిలేసి నమ్మక ద్రోహం చేసిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భర్త త్యాగం.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

పెళ్లి అంటే భార్యభర్తల మధ్య నమ్మకం. జీవితాంతం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడు ఉంటామనే భరోసా. కానీ ఈ బంధానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిందో భార్య. భర్త కష్టపడి తనను చదివిస్తే ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను, కుమారుడిని వదిలేసి ప్రియుడితో జంప్ అయిపోయింది. కట్టుకున్న వాడిని వదిలేసి ఏకంగా ప్రియుడితో అద్దె ఇంట్లో మకాం పెట్టి భర్త రెడ్ హ్యాండెడ్‍గా దొరికిపోయింది. ఈ షాకింగ్ ఘటన బిహార్‍లోని వైశాలి జిల్లాలో వెలుగు చూసింది. సదరు మహిళ భర్త వెల్లడించిన ప్రకారం ఈ కేసులోని వివరాలు ఇలా ఉన్నాయి.

హాజీపూర్ నగర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బాధితుడికి 2013లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత భార్యను ఉన్నత చదువులు చదివించాలని అతడు ఆశపడ్డాడు. ఆమె చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదని పట్టణంలో ఒక అద్దె గది తీసుకుని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పని చేసి ఆర్థికంగా సహకారం అందించాడు. ఈ క్రమంలో ఆమె చదువులకు ఆర్థిక ఇబ్బందుల ఏర్పడితే తన పూర్వీకుల నుంచి వచ్చిన సొంత భూమిని సైతం అమ్మేసి ఆమె చదువుల కోసం ఆ డబ్బు వెచ్చించాడు. భర్త పడ్డ కష్టంతో ఆమె గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసి, బీపీఎస్‌సీ (BPSC TRE-2) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇంత వరకు బాగానే ఉన్న ఉద్యోగం వచ్చాక ఆమె ప్రవర్తనలో మార్పు మొదలైంది.

ఉద్యోగం రాగానే మారిన ప్రవర్తన

ఉద్యోగం సాధించిన సదరు భార్య ఉపాధ్యాయ శిక్షణ సమయంలో ఆమెకు కాలేజీ రోజుల్లోని పాత మిత్రుడితో మళ్లీ పరిచయం ఏర్పడింది. అది కాస్త అనైతిక బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె తన భర్తకు గుడ్ బై చెప్పేసిన ఏకంగా ప్రియుడితో అద్దె గదిలో మకాం పెట్టేసింది. భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త మే 23 వ తేదీన లిచ్చవి నగర్ లోని ఒక అద్దె ఇంట్లో తన భార్యతో పాటు ఆమె ప్రియుడితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు వచ్చే లోపు స్థానికులు, ఇంటి యజమాని గొడవ జరగకుండా సర్దిచెప్పారని బాధితుడు ఆరోపించాడు.

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‍హెచ్ఓ సికందర్ కుమార్ మాట్లాడుతూ సదరు మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేసి స్టేషన్‍కు తీసుకువచ్చామన్నారు. ఆమె తన భర్తతో ఉండలేలని ఇకపై ప్రియుడితోనే జీవిస్తానని చెబుతోందని పోలీసులు వెల్లడించారు. కాగా తల్లి చేసిన పనికి పదేళ్ల ఆమె బాలుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇకపై ఆమెతో కలిసి జీవించలేనని, ఆమెతో వెళ్లడానికి నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

భర్త త్యాగాన్ని విస్మరించి, ప్రభుత్వ ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన ఈ భార్య చర్య సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. నమ్మక ద్రోహంపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.