|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజస్థాన్‌లో భార్య పగ: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపేసింది!

Published: 24-03-2026, 12:35 AM
రాజస్థాన్‌లో భార్య పగ: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపేసింది!
  • రాజస్థాన్‌లో వివాహేతర సంబంధం ఘోరం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.
  • భార్య అను దేవికి వివాహానికి ముందే అమ్రారామ్ అనే ప్రియుడు ఉన్నాడు.
  • భర్త నిద్రిస్తుండగా గొంతు నులిమి చంపేసిన అను, అమ్రారామ్.
  • పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు అను దేవి.

రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘోరం జరిగింది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివాహేతర సంబంధం: ప్రేమకు అడ్డుగా ఉన్న భర్త

దేశ వ్యాప్తంగా వివాహేతర సంబంధాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటాన్నాయి. తాజాగా తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా గొంతు నులిమి హతమార్చిన ఉదంతం రాజస్థాన్‌ (Rajasthan) లోని బలోత్రా (Balotra) జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు మాల్వా గోయ్లాన్ గ్రామానికి చెందిన మహేంద్ర మేఘవాల్ (23)‌తో నాలుగేళ్ల క్రితం అను‌ దేవి (23)తో వివాహమైంది. అయితే, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే, భార్య అను‌దేవికి వివాహానికి ముందే ప్రియుడు అమ్రారామ్ (Amraram) ఉన్నాడు. అతడు ఓ ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్-3 ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

కాగా, మార్చి 20న మహేంద్ర మేఘవాల్‌ (Mahedra Medhawal), అను దేవి (Anu Devi)కి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఉన్న అను‌దేవి అర్ధరాత్రి తన ప్రియుడు అమ్రారామ్‌ను ఇంటికి పిలిపించింది. మహేంద్ర గాఢనిద్రలో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి అతని గొంతు నులిమి సైలెంట్ చంపేశారు. అనంతరం అమ్రారామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ మరుసటి రోజు ఉదయం మహేంద్ర ఎంతకీ బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. గదిలోకి వెళ్లి చూడగా మహేంద్ర విగతజీవిగా పడి ఉన్నాడు. అను‌దేవి మాత్రం అతను ఇంకా నిద్రపోతున్నాడని అబద్ధం చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, మహేంద్ర మెడపై ఉన్న గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అను దేవి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో వారు తమదైన స్టైల్లో విచారించగా, తన ప్రియుడు అమ్రారామ్‌తో కలిసి భర్తను హతమార్చినట్లుగా ఆమె అంగీకరించింది. ఈ మేరకు పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రియుడితో కలిసి హత్య: నిద్రలో ఉండగా దారుణం

పోలీసుల విచారణ: నేరం అంగీకరించిన భార్య

ఈ ఘటన వివాహేతర సంబంధాల వల్ల జరిగే నేరాలను మరోసారి గుర్తు చేసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.