
📌 Key Points
- కోమాలో ఉన్న భర్త వీర్యం సేకరించేందుకు భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
- భర్త కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండటంతో బిడ్డను కనాలని నిర్ణయం.
- సంతానోత్పత్తి చికిత్సలకు భార్యాభర్తల అంగీకారం తప్పనిసరి కావడం సమస్యగా మారింది.
- వీర్యం సేకరించడం సాధ్యమేనా అని తెలుసుకోవడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
కోమాలో ఉన్న భర్త ద్వారా బిడ్డను కనడానికి అతని వీర్యాన్ని సేకరించి భద్రపరచడానికి అనుమతి కోరుతూ ఒక మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అరుదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భర్త కోమాలోకి వెళ్లడానికి గల కారణాలు
కోమాలో ఉన్న తన భర్త ద్వారా బిడ్డను కనేలా అతడి వీర్యాన్ని సేకరించి, భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలి ఓ మహిళ ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించింది. అరుదైన ఈ ఘటనకు సంబంధించిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తి 2025 మార్చి నుంచి కోమాలో ఉండగా అతడికి ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు.ఈ నేపథ్యంలో తన భర్త ద్వారా తాను తల్లిని కావడానికి తన భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరచుకోవాలని సదరు మహిళ భావించింది. కానీ నిబంధనల ప్రకారం సంతానోత్పత్తి చికిత్సలకు భార్యాభర్తలిద్దరి పరస్పర అంగీకరం తప్పనిసరి. కానీ ఇక్కడ భర్త అపస్మారక స్థితిలో ఉండటం వల్ల ఆయన అంగీకారం తెలపడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన భార్య తన భర్త వీర్యం ఇంకా సజీవంగా ఉన్నప్పుడే దానిని సేకరించి భద్రపరచాలని కోర్టును కోరింది. ఆలస్యం జరిగితే వీర్యం నాణ్యత దెబ్బతింటుందని, తద్వారా ఆమె తల్లి కావాలనే ఆశలు శాశ్వతంగా అడుగంటుతాయని ఆమె తరపు న్యాయవాది అరిజిత్ గౌర్ కోర్టుకు విన్నవించారు.
అయితే తన అభ్యర్థనను పరిష్కరించడానికి, భర్త ప్రస్తుత వైద్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నమూనాను సేకరించి భద్రపరచడం సాధ్యమేనా? సురక్షితమేనా అని నిర్ధారించడానికి ఒక నిపుణుల వైద్య మండలిని ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు. సర్జికల్ స్పెర్మ్ కలెక్షన్ లేదా సర్జికల్ స్పెర్మ్ రిట్రీవల్ అని పిలువబడే ఈ ప్రక్రియలో, ఒక సన్నని సూదిని ఉపయోగించి వృషణాల నుండి వీర్యాన్ని వెలికితీస్తారని IVF నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఆయుష్ గౌర్ ఈ కేసును అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సున్నితమైన అంశంపై ఏప్రిల్ 9 (రేపు) విచారణ జరగనుంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చే తీర్పు ఇలాంటి మరిన్ని కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.
పిటిషనర్ కోర్టును ఎందుకు ఆశ్రయించింది?
వైద్య నిపుణుల అభిప్రాయం
ఈ కేసు ఒక సున్నితమైన అంశం. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇలాంటి కేసుల్లో ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. రేపటి విచారణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


