
పాన్ ఇండియా స్టార్ యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తాజాగా కోతలవాడి సినిమా టీజర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. యశ్ తో సినిమా తీయడం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Key Points
కేజీఎఫ్ హీరో యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు.
ఆమె తాజా చిత్రం కోతలవాడి టీజర్ విడుదలైంది.
యశ్ తల్లితో సినిమా తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారని మీడియా ప్రశ్నించింది.
యశ్ తల్లి, ఆయనకు అన్నీ ఉన్నాయని, తాను ఆయనతో సినిమా తీయనని సమాధానం ఇచ్చింది.
కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.
కోతలవాడి టీజర్ విడుదల
అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
మీడియా ప్రశ్నకు యశ్ తల్లి సమాధానం
అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం.
యశ్ తల్లి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె కొడుకు యశ్ కెరీర్‌లో ఉన్న విజయాలను గుర్తిస్తూనే, తాను సినిమా నిర్మాణంలో పాల్గొనకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


