|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’: ఒక్క సినిమాకి 150 కోట్లు! ఇండస్ట్రీ షాక్!!

Published: 23-02-2026, 12:35 AM
యష్ 'టాక్సిక్': ఒక్క సినిమాకి 150 కోట్లు! ఇండస్ట్రీ షాక్!!
  • టాక్సిక్ మూవీ కోసం యష్ భారీగా మూడేళ్లు వెయిట్ చేసినట్లు సమాచారం!
  • కేజీఎఫ్ తరువాత యష్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్.
  • నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో లాభాల్లో రూ.100 కోట్ల వరకు వాటా!
  • మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న టాక్సిక్.. రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం!

కన్నడ స్టార్ యష్ హీరోగా ‘టాక్సిక్’ మూవీ వస్తోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యష్ ‘టాక్సిక్’ మూవీతో భారీ రికార్డ్స్?

Yash: కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఏకంగా ఐదురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తరువాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఏ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో యష్ ఊచకోత చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. విజువల్స్ సైతం హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో ఇండియా లెవెల్లో ఈ సినిమా భారీ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని మార్చి 19న టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెమ్యునరేషన్ తో యష్ సరికొత్త రికార్డ్!

అయితే, తాజాగా టాక్సిక్ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, టాక్సిక్ సినిమా కోసం యష్(Yash) ఏకంగా మూడేళ్లు వెయిట్ చేశాడు. అందుకోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట యష్. కేజీఎఫ్ తరువాత స్టార్ట్ అయిన ఈ సినిమాకు యష్ రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా అందుకున్నాడట. అలాగే, ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వాయం అయ్యాడు కాబట్టి ప్రాఫిట్స్ లో రూ.100 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

మార్చి 19న ‘టాక్సిక్’ విడుదల!

అలా టాక్సిక్ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల వరకు సంపాదిస్తున్నారు యష్. దాంతో ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. మూడేళ్ళ తరువాత కూడా ఈ రేంజ్ క్రేజ్ అంటే మాములు విషయం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత భారీ అంచనాల మధ్య వస్తున్న టాక్సిక్ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

యష్ ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.