
📌 Key Points
- టాక్సిక్ టీజర్‌లోని శృంగార సన్నివేశంపై మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం!
- సెక్స్ సీన్‌లో నటించిన బ్రెజిల్ మోడల్ బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్!
- యష్, బీట్రిజ్ టౌఫెన్‌బాచ్‌ల మధ్య శృంగార సన్నివేశం వివాదాస్పదంగా మారింది.
- సెన్సార్ బోర్డుకు మహిళా కమీషన్ లేఖ, చర్యలు తీసుకోవాలని డిమాండ్!
కేజీఎఫ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా టీజర్ విడుదలైందో లేదో అప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఒక శృంగార సన్నివేశం వివాదానికి దారితీయడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వివాదానికి కారణమైన ఆ ఒక్క సీన్!
కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం వివాదాస్పదమైంది. మహిళా సంఘాల ఫిర్యాదులతో ఈ విషయం దుమారం రేగగా, ఆ సన్నివేశంలో నటించిన బ్రెజిల్ మోడల్ బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్క శృంగార సీన్ ఎంత పనిచేసింది అని అనుకుంటున్నారు నెటిజన్స్. హీరోతో చేసిన సెక్స్ సీన్ నటి జీవితాన్నే మార్చేసింది. అయితే, అది ఆమెను సోషల్ మీడియా లో యాక్టివ్‌గా ఉండకుండా కూడా చేసేసింది.
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన బ్యూటీ!
ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టాక్సిక్ సినిమా గురించే. కేజీఎఫ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమే ఈ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మొదట ఆమె నటాలీ బర్న్ అని ప్రచారం జరిగినప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ ఆ బ్యూటీ బ్రెజిల్ నటి బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ అని పరిచయం చేశారు. అయితే, ఆ ఒక్క సెక్స్ సీన్‌తో టాక్సిక్ టీజర్‌పై దుమారం రేగింది.
సెన్సార్ బోర్డుకు మహిళా కమీషన్ లేఖ!
ఆ దృశ్యంపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది. ప్రస్తుతం ఆమె ప్రొఫైల్ కోసం వెతికితే ‘పేజీ అందుబాటులో లేదు’ అని చూపిస్తోంది. దీంతో కారులో యశ్‌తో శృంగార సీన్ నటి బీట్రిజ్ జీవితాన్నే మార్చేసిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.
దీనిపై స్పందించిన మహిళా కమీషన్, తగిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు (CBFC) లేఖ రాసింది. మరోవైపు సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కూడా అభ్యంతరకర దృశ్యాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆ ఒక్క సీన్‌తో టాక్సిక్ వివాదంలో చిక్కుకుంది. చివరికి నటి బీట్రిజ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేవరకు దారి తీసింది.
యష్ ‘టాక్సిక్’ మూవీ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


