|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారీ కుట్ర: ఎర్ర సముద్రంలో ముప్పు! యుద్ధంలోకి మరో దేశం ఎంట్రీతో టెన్షన్!

Published: 28-03-2026, 8:35 AM
భారీ కుట్ర: ఎర్ర సముద్రంలో ముప్పు! యుద్ధంలోకి మరో దేశం ఎంట్రీతో టెన్షన్!
  • యెమెన్ నుండి ఇజ్రాయెల్‌పైకి హౌతీ మిసైల్ దాడి జరిగింది.
  • హౌతీలు 2014 నుండి సనా నగరాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు.
  • హార్మూజ్ జలసంధి మూసివేతతో అనేక దేశాలపై ప్రభావం పడింది.
  • ఎర్ర సముద్రం గుండా జరిగే వాణిజ్య నౌకల ప్రయాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి యెమెన్ ప్రవేశించింది. హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయడంతో ఎర్ర సముద్రం గుండా జరిగే వాణిజ్యానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉంది.

యుద్ధంలోకి యెమెన్: కారణాలు ఏంటి?

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మొదలైన యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధరంగంలోకి మరో దేశం ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా యెమన్ నుంచి ప్రయోగించిన మిసైల్‍‍ను గగణతలంలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) వెల్లడించింది. ఇరాన్ మద్దతుదారుగా ఉన్న హౌతీ తిరుగుబాటు గ్రూప్ ఈ క్షిపణిని ఇజ్రాయెల్‍పై కి ప్రయోగించింది. 2014 నుంచి యెమెన్ రాజధాని సనా నగరాన్ని హౌతీలు తమ నియంత్రణలో ఉంచుకున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత యెమెన్ నుంచి జరిగిన తొలి దాడి ఇదే కావడంతో పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల్లోకి తాజాగా యెమన్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.

యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా చమురు, గ్యాస్ సమస్యలతో పాటు ఇతర ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హౌతీలు సైతం యుద్ధరంగంలోకి దిగితే ఎర్రసముద్రం రవాణా మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ ఎర్రసముద్రం గుండా ప్రతి యేడాది సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులు రవాణా అవుతాయి. ఇదే మార్గం గుండా ఇజ్రాయెల్ దిగుమతుల్లో సుమారు 30 శాతం రవాణా జరుగుతుంది. ఇలాంటి ఎర్రసముద్రంపై హౌతీలు ఇటీవల తరచూ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మరింత దూకుడుగా ముందుకు వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయానేది వేచి చూడాలి.

ఎర్ర సముద్రంపై ప్రభావం ఎంత?

భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

హౌతీల చర్యల వల్ల ఎర్ర సముద్రం గుండా జరిగే వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని అరికట్టడానికి అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.