|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా ‘హనీమూన్‌’ ఎప్పుడో మీరే ఫిక్స్‌ చేయండి: త్రిష

Published: 10-10-2025, 10:43 AM
నా 'హనీమూన్‌' ఎప్పుడో మీరే ఫిక్స్‌ చేయండి: త్రిష

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ త్రిష పెళ్లి గురించి సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆమె సరదాగా స్పందించింది. తన హనీమూన్‌ను కూడా అభిమానులే ప్లాన్ చేయమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో పెళ్లి వార్తలు ఫేక్ అని త్రిష తన పోస్ట్‌తో స్పష్టం చేసింది.

Key Points

1

త్రిష పెళ్లి గురించి సోషల్‌మీడియాలో తీవ్ర ప్రచారం.

2

అభిమానులే తన హనీమూన్‌ ప్లాన్‌ చేయాలని త్రిష సరదా పోస్ట్.

4

తన పోస్ట్‌తో పెళ్లి రూమర్స్ ఫేక్ అని త్రిష క్లారిటీ ఇచ్చింది.

త్రిష పెళ్లి రూమర్స్ నిజమేనా?

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ త్రిష  పెళ్లి చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈసారి నిజమనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే త్రిష తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. చాలామంది అభిమానులు నా జీవితాన్ని కూడా నిర్ణయించేస్తున్నారు.  ఇంకేముంది నా హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా మీరే ప్లాన్‌ చేయండి అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది.  తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌ గురించి ఆమె ఇలా సరదాగా రియాక్ట్‌  అయింది.

అభిమానులపై త్రిష సరదా కామెంట్స్

చండీగఢ్ వ్యాపారవేత్తను త్రిష వివాహం చేసుకోబోతోందంటూ తమిళనాడులో వార్తలు వైరల్‌ అయ్యాయి.  ఇరు కుటుంబ సభ్యులు కూడా  ఆమోదం తెలిపారని కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్‌లో కూడా ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించాయి. తమిళం, తెలుగు పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు.  చండీగఢ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న అతని గురించి వివరాలు పరిమితంగా ఉన్నాయంటూనే రెండు కుటుంబాల మధ్య పరిచయం చాలా సంవత్సరాల నుంచే ఉందంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో ఈ రూమర్స్‌పై నిజమనే సంకేతాలు ఇస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. కానీ, తాజాగా త్రిష చేసిన పోస్ట్‌తో అదంతా ఫేక్‌ అని మరోసారి క్లారిటీ అయింది.

గత నిశ్చితార్థం, ప్రస్తుత సినిమాలు

2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరోవైపు వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది. చిరంజీవి విశ్వంభరలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.

త్రిష పెళ్లి రూమర్స్ నిజం కాదని ఆమె పోస్ట్‌తో స్పష్టమైంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష ప్రస్తుతం తన కెరీర్‌పైనే దృష్టి సారించింది. ఆమె అభిమానులు తదుపరి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.