
బాలీవుడ్‌లో విషాదాలు కొనసాగుతున్నాయి. ‘జమత్ర’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన మరాఠీ నటుడు సచిన్ చంద్‌వాడే (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్న సచిన్ మరణం సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది.
Key Points
'జమత్ర' వెబ్ సిరీస్ నటుడు సచిన్ చంద్‌వాడే (25) ఆత్మహత్య చేసుకున్నారు.
పుణెలోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ సచిన్ ఉద్యోగం చేస్తున్నారు.
ఆత్మహత్యాయత్నం చేసి 24 గంటలు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
చిన్న వయసులోనే నటుడి మరణం సినీ పరిశ్రమ, సన్నిహితులను షాక్‌కు గురిచేసింది.
‘జమత్ర’ నటుడి విషాద మరణం
ఈనెలలో బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. ‘జమత్ర’ అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్‌వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నటుడు సచిన్ చంద్‌వాడే నేపథ్యం
ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్‌లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్‌ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.
పరిశ్రమలో విషాద ఛాయలు
చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా ‘జమత్ర 2’లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు.
చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టపడే సచిన్.. ఉద్యోగంతో పాటు నటనను కొనసాగించాడు. ఇంత చిన్న వయసులోనే ఇలా ప్రాణాలు తీసుకోవడం అతని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, సహ నటీనటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


