|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ.. ‘సూర్య-46’ సినిమాలో కీ రోల్..

Published: 01-08-2025, 10:21 AM
బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ.. ‘సూర్య-46’ సినిమాలో కీ రోల్..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూర్య-46’ చిత్రంలో యంగ్ బ్యూటీ భవాని శ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. విడుదలై-2 సినిమాతో గుర్తింపు పొందిన ఆమెకు ఇది పెద్ద అవకాశం.

Key Points

1

సూర్య-46 సినిమాలో భవాని శ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

2

విడుదలై-2 సినిమాతో పేరు తెచ్చుకున్న భవాని శ్రీకి ఇది పెద్ద అవకాశం.

4

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై ఈ చిత్రం నిర్మాణం జరుగుతోంది.

భవాని శ్రీకి సూర్య సినిమాలో అవకాశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తున్న ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే తెలుగులో సూర్య ఓ మూవీ చేయనున్నారు. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) సూర్య సరసన నటిస్తోంది. ‘సూర్య-46’ వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సూర్య గజిని లోని సంజయ్ రామస్వామి వంటి పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల డైరెక్టర్ వెల్లడించారు.

‘సూర్య-46’ చిత్ర విశేషాలు

అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సూర్య-46’ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ యంగ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో భవాని శ్రీ(bhavanisre) ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు టాక్. ఆమెను చిత్రబృందం సంప్రదించగా.. నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆమె ‘సూర్య-46’లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇక ఈ అమ్మడు ఇటీవల ‘విడుదలై-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ సూర్య చిత్రంలో చాన్స్ అందుకోవడంతో అమ్మడు దశ మారనుందని అంతా భావిస్తున్నారు.

భవాని శ్రీ కెరీర్ లో మలుపు

A post shared by Bhavani Sre (@bhavanisre)

భవాని శ్రీకి ‘సూర్య-46’ చిత్రం కెరీర్‌లో మంచి మలుపు తీసుకురానుంది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.