|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇవాళే మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. హౌజ్‌లోకి 14 మంది ఫైనల్ కంటెస్టెంట్స్!

Published: 07-09-2025, 10:01 AM
ఇవాళే మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్.. హౌజ్‌లోకి 14 మంది ఫైనల్ కంటెస్టెంట్స్!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అవుతారు. స్టార్ మా మరియు జియో హాట్‌స్టార్‌లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం ప్రారంభం.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9 సాయంత్రం 7 గంటలకు ప్రారంభం.

2

14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ.

4

స్టార్ మా ఛానల్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రసారం.

గ్రాండ్ లాంచ్ వివరాలు

తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ 8 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇవాళ (సెప్టెంబర్ 7) తొమ్మిదో సీజన్‌తో రానుంది. స్టార్ మా ఛానెల్‌లో బిగ్ బాస్ 9 తెలుగు నేడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.

స్టార్ మా ఛానెల్‌తోపాటు జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ)లో కూడా బిగ్ బాస్ 9 తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోను విడుదల చేశారు. కామనర్స్‌గా వచ్చిన కంటెస్టెంట్స్‌ను తప్పా మిగతా సెలబ్రిటీ కంటెస్టెంట్ల మొహాలను ఏమాత్రం రివీల్ చేయలేదు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు ఫైనల్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్‌పై అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ 9 తెలుగు ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురు రివ్యూవర్స్ గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ లాంచ్‌కు సంబందించిన షూటింగ్ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 6న జరిగిపోయింది.

కంటెస్టెంట్ల జాబితా

కాబట్టి, బిగ్ బాస్ తెలుగు ఈ సీజన్‌లో ఎంతమంది కంటెస్టెంట్స్, వారు ఎవరెవరు అనేది సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి ఈ గ్రాండ్ లాంచ్ ద్వారా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో ఐదుగురు అగ్ని పరీక్ష ద్వారా పాస్ అయిన కామనర్స్ ఉన్నారు.

బిగ్ బాస్ తెలుగు 9 అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన ఐదుగురిలో మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ పవన్ కల్యాణ్, మనీష్ మర్యాద, ప్రియ ఉన్నారు. వీరిలో మనీష్‌ను అగ్ని పరీక్ష హోస్ట్ యాంకర్ శ్రీముఖి, మాస్క్ మ్యాన్‌ని జడ్జ్ బిందు మాధవి, దమ్ము శ్రీజను హీరో నవదీప్ సెలెక్ట్ చేశారని టాక్. మిగతా వారు ఆడియెన్స్ నుంచి వచ్చిన ఓట్ల ద్వారా కంటెస్టెంట్స్‌గా సెలెక్ట్ అయ్యారట.

ప్రసార వివరాలు

ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌గా 9 మంది ఫైనల్ అయ్యారు. వారిలో ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ, సీరియల్ నటుడు భరణి శంకర్, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయెల్, సీనియర్ హీరోయిన్ ఆశా సైనీ, కమెడియన్ సుమన్ శెట్టి, హీరోయిన్ సంజన గల్రాని, సింగర్ రాము రాథోడ్, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఉన్నారు.

వీరతా ఇందే వరుస క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చారు. రాము రాథోడ్ సింగింగ్ పర్ఫామెన్స్ ఇస్తే రీతూ, ఆశ, తనూజ, సంజన డ్యాన్స్‌తో అడుగుపెట్టారు. ఇక ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి ఏవీలతో పరిచయం చేసుకున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ తో ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14 మంది కంటెస్టెంట్లతో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.