|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆఫ్ సెంచరీ దాటిన హీరోతో యంగ్ బ్యూటీ రొమాన్స్.. ఇప్పుడున్న క్రేజ్‌లో అవసరమా అంటున్న ఫ్యాన్స్?

Published: 05-07-2025, 11:14 AM
ఆఫ్ సెంచరీ దాటిన హీరోతో యంగ్ బ్యూటీ రొమాన్స్.. ఇప్పుడున్న క్రేజ్‌లో అవసరమా అంటున్న ఫ్యాన్స్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం బిజీగా ఉంది. తాజాగా ఆమె 64 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ జంటను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Key Points

1

నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

2

64 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి నిధి సిద్ధమవుతోంది.

4

2026 సమ్మర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు.

నిధి అగర్వాల్ కొత్త సినిమా

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal).. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu), ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఉన్నాయి. ఇక రీసెంట్‌గా ‘వీరమల్లు’ నుంచి ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో నిధి లుక్‌కు యూత్ మరింత ఎట్రాక్ట్ అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో నిధి వైరల్ బ్యూటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తుందట ఈ అమ్మడు.

ఇందులో భాగంగా.. 64ఏళ్ల హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయిందట. టాలీవుడ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు విక్టరీ వెంకటేష్(Venkatesh). ఇక దీంతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి ‘రమణ కేరాఫ్ ఆనంద నిలయం’ (Ramana C/o Ananda Nilayam)అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారట. ఇందులో ఇద్దరు హీరోయిన్‌లను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుండగా.. వారిలో ఒకరు నిధి అగర్వాల్ అని టాక్. ఈ సినిమాను 2026 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట.

వెంకటేష్ తో జంట

ఫ్యాన్స్ అభిప్రాయాలు

వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో నిధి అగర్వాల్ నటించడం ఆసక్తికరంగా ఉంది. సినిమా విజయవంతం అవుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.