|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది ప్యారడైజ్’మూవీలో వేశ్యగా యంగ్ హీరోయిన్ .. నీకేం పోయేకాలం వచ్చిందంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

Published: 15-07-2025, 9:36 AM
‘ది ప్యారడైజ్’మూవీలో వేశ్యగా యంగ్ హీరోయిన్ .. నీకేం పోయేకాలం వచ్చిందంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు

కోలీవుడ్ నటి కయాదు లోహర్ ‘ది ప్యారడైజ్’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Key Points

1

‘ది ప్యారడైజ్’ సినిమాలో కయాదు లోహర్ వేశ్య పాత్ర పోషిస్తోంది.

2

ఈ పాత్ర కోసం బోల్డ్ సన్నివేశాలు, స్కిన్ షో చేయాల్సి ఉంటుంది.

4

సినిమా 2024 మార్చి 26న విడుదల కానుంది.

కయాదు లోహర్ కొత్త సినిమా

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadu Lohar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మొగిల్ పేట’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. గత ఏడాది ‘డ్రాగన్’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. తన నటన, అందంతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో కయ్యదుకు ఫుల్ క్రేజ్ వచ్చి పడింది. ప్రస్తుతం కయ్యదు లోహర్ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ కథలు ఒకే చేస్తూ అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఇప్పుడు కయ్యదు, తెలుగులో విశ్వన్ సేన్ సరసన ‘ఫంకీ’ లో కనిపించనుంది.

తాజాగా, కయాదు లోహర్ టాలీవుడ్‌లో మరో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ ది ప్యారడైజ్’(The Paradise) మూవీలో వేశ్య పాత్రలో కయ్యదు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్ర చాలా స్కిన్ షోతో పాటు కొన్ని బోల్డ్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుందట. డ్రాగన్ విజయంతో ఉత్సాహంగా ఉన్న కాయాదు స్క్రిప్ట్‌ను ఇష్టపడి, అడ్డంకులు ఉన్నప్పటికీ ఆ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

వేశ్య పాత్రపై విమర్శలు

నటి ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ అయినట్లు టాక్. ఆమె పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలువనుంది. ప్రస్తుతం కయాదుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు నీకేం పోయేకాలం వచ్చిందని తిడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె దశ మారనుందని అభిప్రాయ పడుతున్నారు. కాగా, శ్రీకాంత్ ఓదె, నాని కాంబినేషన్‌లో ‘ప్యారడైజ్’ రాబోతుంది.ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతుంది.

నెటిజన్ల ప్రతిస్పందన

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

చివరగా, కయాదు లోహర్ ‘ది ప్యారడైజ్’ లోని బోల్డ్ పాత్ర నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. సినిమా విజయంపైనే ఈ వివాదం ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.