|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు.. అఖిల్ తో కూడా యంగ్ హీరోయిన్ రొమాన్స్

Published: 26-06-2025, 4:21 AM
విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు.. అఖిల్ తో కూడా యంగ్ హీరోయిన్ రొమాన్స్

అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ప్రారంభంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికయ్యారు కానీ, తాజాగా ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే నటించే అవకాశం ఉంది.

Key Points

1

అఖిల్ ‘లెనిన్’ సినిమా నుండి శ్రీలీల తప్పుకుంది.

2

భాగ్యశ్రీ బోర్సే కొత్త హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది.

4

‘లెనిన్’ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా.

‘లెనిన్’ సినిమాకు హీరోయిన్ మార్పు

అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్‌ఎస్ థమన్ పనిచేస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బిగినింగ్ లోనే ఈ చిత్రానికి షాక్ తప్పలేదు. ఈ చిత్రం నుంచి హీరోయిన్ గా శ్రీలీల తప్పుకున్నట్లు ఇప్పటికే తెలియజేశాం. ఇప్పుడు కొత్త హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

మొదట ఈ చిత్రానికి కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం డేట్ ఇష్యూస్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె సినిమా నుంచి పూర్తిగా వైదొలిగినట్టు తెలుస్తోంది.

భాగ్యశ్రీ – కొత్త స్టార్ హీరోయిన్?

శ్రీలీల స్థానంలో ఇప్పుడు మరో క్రేజీ నటి భాగ్యశ్రీ బోర్సే వస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆమె ఇటీవలే రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ భాగ్య శ్రీ గ్లామర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతలో ఆమెకి బాగా ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం భాగ్యశ్రీ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాంతా’ చిత్రంతో పాటు రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రంలో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది.

భాగ్యశ్రీ అఖిల్ లెనిన్ చిత్రంలో నటించబోతున్నట్లు ఇంకా అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రాలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆమె పాత్ర ఖరారైనట్టు భావిస్తున్నారు. భాగ్య శ్రీ జోరు చూస్తుంటే టాలీవుడ్ కొత్త స్టార్ హీరోయిన్ అవతరించింది అని విశ్లేషకులు అంటున్నారు.

అఖిల్ ‘లెనిన్’ చిత్ర విశేషాలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘లెనిన్’ టీజర్ విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం రిలీజ్ డేట్‌ను ఖరారు చేయాల్సి ఉంది. డైరెక్టర్ మురళి కిషోర్ ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నారు. పెళ్లి తర్వాత అఖిల్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

అఖిల్ ‘లెనిన్’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. భాగ్యశ్రీ నటనతో ఈ చిత్రం మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. చిత్ర విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.