|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ యంగ్ హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ఆల్‌ది బెస్ట్ చెబుతున్న నెటిజన్లు

Published: 14-07-2025, 12:19 AM
అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ యంగ్ హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ఆల్‌ది బెస్ట్ చెబుతున్న నెటిజన్లు

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, తన ‘జూనియర్’ సినిమాకు ఆయన ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

Key Points

1

యంగ్ హీరోయిన్ శ్రీ లీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో శివరాజ్ కుమార్‌తో ఫోటో షేర్ చేసింది.

2

శివరాజ్ కుమార్‌కు శ్రీ లీల బర్త్‌డే విష్ చేసింది.

4

నెటిజన్లు 'జూనియర్' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

శ్రీ లీల-శివరాజ్ కుమార్ ఫోటో వైరల్

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

‘జూనియర్’ సినిమాకు శుభాకాంక్షలు

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు జూనియర్ మూవీలో అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

నెటిజన్ల స్పందన

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న(Shivanna)తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అతనికి బిలెటెడ్‌గా బర్త్‌డే విష్ తెలిపింది. అలాగే మా జూనియర్(Junior) సినిమాను బ్లెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు జూనియర్ మూవీ మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా తాజాగా జూనియర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శివన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.

శ్రీలీల చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెకు, ‘జూనియర్’ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శివరాజ్ కుమార్ బ్లెస్సింగ్స్ సినిమాకు మంచిదని అభిమానులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.