
📌 Key Points
- ఎన్టీఆర్ తన 43వ పుట్టినరోజున ‘అసాహి’, ‘యూహి’ అనే జపనీస్ పేర్లతో కొత్త రామచిలుకలను పరిచయం చేశారు.
- ‘అసాహి’ అంటే సూర్యోదయం, ‘యూహి’ అంటే సూర్యాస్తమయం అని జపనీస్ భాషలో అర్థం.
- ‘RRR’ సినిమాతో తారక్ అంతర్జాతీయ గుర్తింపు పొందగా, త్వరలో ‘వార్ 2’, ‘డ్రాగన్’ చిత్రాల్లో కనిపించనున్నారు.
- కెరీర్ ఎంత బిజీగా ఉన్నా, కుటుంబానికి, పెంపుడు జంతువులకు ఎన్టీఆర్ ఇచ్చే ప్రాధాన్యత నెటిజన్లను ఆకట్టుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 43వ పుట్టినరోజున అభిమానులకు క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త పెంపుడు రామచిలుకలకు ‘అసాహి’, ‘యూహి’ అని జపనీస్ పేర్లు పెట్టి, ఆ దేశ సంస్కృతిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
తారక్ కొత్త పెంపుడు పక్షులు: జపనీస్ పేర్ల వెనుక కథ
NTR Birthday: మే 20, 2026..అంటే సరిగ్గా ఈరోజున తన 43వ ఏట అడుగుపెట్టిన తారక్ తన అభిమానులకు ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తన ఇంటికి కొత్త అతిథులు వచ్చారని సోషల్ మీడియాలో రివీల్ చేస్తూ రెండు అందమైన రామచిలుకలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఈ పక్షులకు తారక్ ‘అసాహి’ మరియు ‘యూహి’ అని పేర్లు పెట్టారు. ఇవి జపనీస్ భాషా పదాలు కావడం విశేషం. జపనీస్ భాషలో అసాహి అంటే ‘సూర్యోదయం’ అని, యూహి అంటే ‘సూర్యాస్తమయం’ అని అర్థం. తనకు జపాన్ దేశం అంటే ఉన్న ప్రత్యేకమైన అభిమానం, ఆ దేశ సంస్కృతిపై ఉన్న గౌరవంతోనే తన పెంపుడు పక్షులకు ఈ పేర్లు పెట్టినట్లు వివరించాడు .ఇపుడు ఆ పక్షుల ఫొటోలే నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.
తారక్ కెరీర్ విషయానికి వస్తే మొదటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి . తాత నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో బాలనటుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన తారక్, 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘స్టూడెంట్ నెం.1’తో తొలి విజయాన్ని అందుకున్న ఆయన, ‘ఆది’, ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటివరకు ‘యమదొంగ’, ‘అదుర్స్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
ఎన్టీఆర్ కెరీర్ ప్రస్థానం: బాలనటుడి నుండి గ్లోబల్ స్టార్ వరకు
‘RRR’ తో ఇంటర్ నేషనల్ వైడ్ గుర్తింపు
ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ తో ఇంటర్ నేషనల్ వైడ్ గుర్తింపు పొందాడు తారక్.ఇక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర పార్ట్ 1’ సినిమాతో సాలిడ్ హిట్ నే అందుకున్నాడు.అయితే హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ‘వార్ 2’ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ, ఆ చిత్రం బోల్తా కొట్టడంతో ఆ లోటును భర్తీ చేసే పనిలో పడ్డాడు.అందులో భాగంగా కె.జి.ఎఫ్, సలార్ లని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’అనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుట్టాడు.ఇక వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా రానున్న సంగతి తెల్సిందే.
వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్ సమతుల్యత
అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి, తన పెంపుడు జంతువులకు ఎన్టీఆర్ ఇచ్చే ఇంపార్టెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ కురిపిస్తుంటే, తారక్ పంచుకున్న ఈ పక్షుల ఫోటోలు తను ఎంత సెన్సిటివ్ గా ఉంటాడో ప్రూవ్ చేస్తున్నాయ్.ఏది ఏమైనా, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి వరకు తన సత్తా చాటుతున్న యంగ్ టైగర్, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు మనకందించాలని కోరుకుందాం.
ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితంలో కుటుంబానికి, పెంపుడు జంతువులకు ఇచ్చే విలువ అందరినీ ఆకట్టుకుంది. ఆయన ప్రత్యేకమైన స్టైల్, సంస్కృతి పట్ల గౌరవం అభిమానులకు మరింత దగ్గర చేశాయి.


