|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: లైవ్ లోనే కారు ప్రమాదం! యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఆత్మహత్యాయత్నం?

Published: 09-03-2026, 2:35 AM
షాకింగ్: లైవ్ లోనే కారు ప్రమాదం! యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఆత్మహత్యాయత్నం?
  • యూట్యూబర్ అనురాగ్ డోభాల్ ఘజియాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
  • ప్రమాదం జరిగిన సమయంలో అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉన్నారు.
  • కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా అనురాగ్ మానసిక ఒత్తిడికి గురయ్యారని సమాచారం.
  • ప్రస్తుతం అనురాగ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు, పరిస్థితి నిలకడగా ఉంది.

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ డోభాల్ ఘజియాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారని సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనురాగ్ డోభాల్ రోడ్డు ప్రమాదం – లైవ్ వీడియోలో ఘటన

Anurag Crash: ప్రముఖ యూట్యూబర్, ‘బిగ్ బాస్ 17’ కంటెస్టెంట్ అనురాగ్ డోభాల్ (UK07 Rider) ఘజియాబాద్‌ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సుమారు 80,000 మంది వీక్షకులు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనురాగ్ డోభాల్ తన టయోటా ఫార్చ్యూనర్ కారులో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తన ఫాలోవర్లతో మాట్లాడుతున్నారు. కారు సుమారు 140 నుండి 150 కి.మీ. వేగంతో వెళుతూ.. తను సూడైడ్ చేసుకుంటున్నానని.. చెప్పారు. తర్వాత కొంత సేపటికే కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

Read also- Romantic fantasy Drama : ప్రేమ కథలో విస్తుపోయే క్లైమాక్స్… వయసు పెరిగినా తగ్గని తగ్గని జోరు… ఆస్కార్ విన్నింగ్ మూవీ

కుటుంబ కలహాలే కారణమా? మానసిక ఒత్తిడిలో యూట్యూబర్

ప్రమాదానికి ముందు అనురాగ్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. లైవ్ వీడియోలో మాట్లాడుతూ.. “నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మ, వచ్చే జన్మలోనైనా నన్ను ప్రేమించు. నా అన్న నన్ను చాలా బాధపెట్టాడు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మాటలు విన్న నెటిజన్లు ఆయన ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని గ్రహించి కామెంట్ బాక్స్‌లో వారించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ప్రమాదం జరిగి లైవ్ కట్ అయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆయనను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనురాగ్ ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయని, అలాగే శరీరంలో పలు చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. ఆయన మేనేజర్ రోహిత్ పాండే స్పందిస్తూ.. “అనురాగ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది కానీ అబ్జర్వేషన్‌లో ఉంచారు. దయచేసి ఆయన కోలుకోవాలని ప్రార్థించండి” అని కోరారు.

Read also- Useful Android Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇల్లు, ఆఫీస్ రెండింటికీ ఉపయోగకరం

ఐసీయూలో చికిత్స – అనురాగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది

గత కొంతకాలంగా అనురాగ్ తన కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి, సోదరుడు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో దాదాపు ఎనభై వేల మంది ఉండటం గమనార్హం.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అతని మేనేజర్ చెబుతున్నా.. పరిస్థితి మాత్రం చాలా సిరియస్ గా ఉందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే.

ప్రస్తుతం అనురాగ్ డోభాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.