
నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రం 1980ల నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. ఈ చిత్ర పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Key Points
వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో తారక రామారావు హీరోగా సినిమా ప్రారంభం.
వీణారావు హీరోయిన్‌గా నటిస్తున్నారు.
కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.
సినిమా ప్రారంభం
నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, జానకిరామ్(Janaki Ram) కుమారుడు, తారక రామారావు(Taraka Rama Rao) హీరోగా వైవిఎస్ చౌదరి(YVS Chowdary) దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీత(Geetha) నిర్మిస్తోంది. ఎన్టీఆర్ సరసన వీణారావు(Veenah Rao) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ బ్యూటీ తెలుగమ్మాయే కావడం విశేషం. ఇక ఈ మూవీ 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తుండగా.. చంద్రబోస్(Chandra Bose) సాహిత్యాలను అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సీనియర్ ఎన్టీఆర్(Senior NTR) నటించిన ‘తోడు నీడ’(Thodu Needa) సినిమా రిలీజ్ అయి నేటితో 60 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమంతో పాటు షూటింగ్ కూడా స్టార్ కానుంది. ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ఐకానిక్ లాంచ్‌కి సమయం ఆసన్నమైంది.. న్యూ టలెంట్ రోర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 యొక్క గ్రాండ్ ముహూర్తం షూటింగ్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.. ఎప్పటికీ ఉత్సాహవంతుడైన మరియు డైనమిక్ డైరెక్టర్ అయిన వైవిఎస్ చౌదరి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
చిత్రం నేపథ్యం
తారక రామారావు నటనతో పాటు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.


