|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTTలో రూ.100 కోట్ల సినిమా.. ఈ వారంలోనే డ్యూడ్‌ స్ట్రీమింగ్‌

Updated: 12-11-2025, 12:09 AM
OTTలో రూ.100 కోట్ల సినిమా.. ఈ వారంలోనే డ్యూడ్‌ స్ట్రీమింగ్‌

దీపావళికి విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ‘డ్యూడ్‌’ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు ఇతర సినిమాల ఓటీటీ విడుదల తేదీలు కూడా ప్రకటించారు.

Key Points

1

'డ్యూడ్‌' సినిమా నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల.

2

ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో.

4

'కె-ర్యాంప్‌' ఆహాలో, 'తెలుసు కదా' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల.

డ్యూడ్‌ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు

దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ డేట్‌ ఇచ్చేశాయి. కిరణ్‌ అబ్బవరం ‘కె-ర్యాంప్‌’ నవంబర్‌ 15న ఆహాలో రిలీజ్‌ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ మూవీ నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘డ్యూడ్‌’ సినిమా ఓటీటీ డేట్‌ మాత్రం అనౌన్స్‌ చేయకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచారు.

డ్యూడ్‌ సినిమా వసూళ్లు, తారాగణం

ఈ వారమే ఓటీటీలో ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఎట్టకేలకు డ్యూడ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ( Dude Movie OTT Reelase Date ) ప్రకటించారు. నవంబర్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో రానుందంటూ ఎక్స్‌ వేదికగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్‌ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్‌ విషయానికి వస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించగా కీర్తి శ్వరన్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్‌ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది.

డ్యూడ్‌ కథేంటి?

కథ డ్యూడ్‌ కథేంటంటే.. గగన్‌ (ప్రదీప్‌ రంగనాథన్‌).. ఆముద (నేహా శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్‌ను అతడి మేనమామ (శరత్‌ కుమార్‌) కూతురు కుందన (మమిత బైజు) ప్రేమిస్తుంది. కానీ, ఆమె పెళ్లి ప్రపోజల్‌ను గగన్‌ రిజెక్ట్‌ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైమ్‌కు కుందన పార్దు (హృదయ్‌)తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్‌-కుందనకే పెళ్లి జరుగుతుంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి? తర్వాత కలిసున్నారా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి..

మొత్తానికి బ్లాక్‌బస్టర్‌ ‘డ్యూడ్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అభిమానుల సస్పెన్స్‌కు తెరదించింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లభించింది. ఈ సినిమా కథాకమామీషు ఓటీటీలో చూసి ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.