
📌 Key Points
- నిర్మాత SKN ‘3Roses S2’ వెబ్ సిరీస్ ను డిసెంబర్ 12న ఆహాలో విడుదల చేయనున్నాడు.
- ప్రమోషన్ల కోసం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా పాటను ఉపయోగిస్తున్నారు.
- బిగ్ బాస్ సీజన్ 9, 3Roses S2 ఇంటర్వ్యూలో ఈ పాటను వాడారు.
- SKN తన ప్రచార వ్యూహంతో అంచనాలను పెంచుతున్నాడు.
నిర్మాత SKN తన కొత్త వెబ్ సిరీస్ ‘3Roses S2’ ప్రమోషన్ల కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆహాలో డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ కు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా పాటను వినూత్నంగా ఉపయోగిస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇది SKN మాస్టర్ ప్లాన్ గా నిలుస్తోంది.
SKN ప్రమోషన్ల వ్యూహం
3Roses S2 : ఒకవైపు థియేటర్లో విడుదల కాబోయే అద్భుతమైన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండటం మాత్రమే కాకుండా, సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడు నిర్మాత ఎస్ కే ఎన్. నిర్మాత ఎస్ కే ఎన్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తన సినిమాలు ఫంక్షన్స్ లో మాత్రమే కాకుండా ప్రతి సినిమా ఫంక్షన్స్ లో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఎస్ కే ఎన్ కొన్ని సినిమా ఈవెంట్స్ కు హాజరవుతూ తను ఇచ్చే స్పీచ్ వైరల్ గా ఉండేలా చూసుకుంటాడు.
మామూలుగా కొంతమంది సినిమా దర్శకులు పంచులు ప్రాసులను తమ కథల్లో ఎలా రాసుకుంటారు అలాంటివే ఎస్ కే ఎన్ స్పీచ్ లో కూడా తారస పడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఎస్ కే ఎన్ త్రీ రోజెస్ సీజన్ 2 నిర్మించిన సంగతి తెలిసిందే. అది డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ తరుణంలో దానిని విపరీతంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ ఈ సినిమాలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ ట్రైలర్ కూడా సినిమా మీద మంచి అంచనాలను నెలకొల్పింది.
అయితే ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సింగిల్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సింగిల్ రిలీజ్ రోజు కూడా చెప్పిన టైంకి విడుదల చేయలేకపోయారు. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఈ సింగిల్ చాలామందిని నిరాశ పరిచింది.
‘రాజా సాబ్’ పాటతో వినూత్న ప్రచారం
ఇక ప్రస్తుతం ఆ సింగిలు విపరీతంగా వాడుతున్నారు. నాగార్జున hostv చేసే బిగ్ బాస్ సీజన్ 9 ఇంట్రో సాంగుగా దానిని నిన్న ఎపిసోడ్ లో వాడారు. ఈరోజు త్రీ రోజెస్ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ విడుదలైంది. ఆ ఇంటర్వ్యూ అనంతరం ముగ్గురు హీరోయిన్లు ఈ పాటకు వైబ్ అయ్యారు. రీల్ పూర్తయిన చివర్లో ఎస్కేయం త్రీ రోజెస్ డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది చూడండి అంటూ చెప్పాడు. మొత్తానికి రాజా సాబ్ బానే వాడుతున్నారు.
Wait for the end 😅 Girls vibing to Blockbuster #RebelSaab in between #3RosesS2 Promotions & Cult Producer @SKNOnline brings an unexpected twist 🤩
3 Roses Season 2, From Dec 12! 🥳🌹 Catch only on @ahavideoIN @DirectorMaruthi @YoursEesha @harshachemudu @kushithakallapu … pic.twitter.com/iKihD7pSF7
— Mass Movie Makers (@MassMovieMakers) December 8, 2025
3Roses S2: ఆహాలో విడుదల వివరాలు
ఎస్ కే ఎన్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎలా అయితే నిర్మిస్తాడో ఆ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కేవలం ప్రయత్నాలు చేయటం మాత్రమే కాకుండా అన్ని విధాల సక్సెస్ కూడా అయ్యాడు.
ఇప్పుడు త్రీ రోజెస్ సినిమా కోసం ఏకంగా ప్రభాస్ సినిమాను వాడుతున్నాడు. అయితే ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎస్ కే ఎన్ ఇచ్చాడు. ఆ సినిమా గురించి ఏ టాపిక్ వచ్చినా కూడా ట్విట్టర్ వేదికగా అందరికీ సమాధానం ఇస్తూ ఉంటాడు. అందుకే ఎస్ కే ఎన్ సినిమాలు తక్కువగా నిర్మించిన కూడా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా వినిపిస్తాడు.
మొత్తం మీద, SKN ‘3Roses S2’ ప్రమోషన్ కోసం ‘రాజా సాబ్’ పాటను తెలివిగా వాడుకుంటున్నారు. ఈ వినూత్న ప్రచార వ్యూహం సిరీస్ పై అంచనాలను మరింత పెంచింది. డిసెంబర్ 12న ఆహాలో విడుదలయ్యే ‘3Roses S2’ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


