|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

40 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోవడానికి తంటాలు.. సింగిల్ మదర్ తో.. ఓటీటీలోని ఈ బోల్డ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మూవీ చూశారా?

Published: 02-09-2025, 2:12 AM
40 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోవడానికి తంటాలు.. సింగిల్ మదర్ తో.. ఓటీటీలోని ఈ బోల్డ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మూవీ చూశారా?

20 ఏళ్ల క్రితం విడుదలైన ‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ అనే హాలీవుడ్ బోల్డ్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది. 40 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోవడానికి తంటాలు పడే ఓ వ్యక్తి కథ ఇది.

Key Points

1

40 ఏళ్ల వయసులో వర్జిన్‌గా ఉండటం

2

సింగిల్ మదర్‌తో సంబంధం

4

హాట్ సీన్స్ మరియు కామెడీతో కూడిన కథ

‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ కథ

20 ఏళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఓ బోల్డ్ మూవీ ఇప్పటికీ ఓటీటీలో అదరగొడుతూనే ఉంది. ఈ అమెరికన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. హాట్ సీన్స్, రొమాంటిక్ ఫీల్, కామెడీ కలగలసిన ‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ బోల్డ్, ఎరోటిక్ మూవీ ఏ ఓటీటీల్లో ఉందో చూద్దాం.

హాలీవుడ్ బోల్డ్ మూవీ ‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ప్రధాన వేదికల్లో అందుబాటులో ఉంది. జియోహాట్‌స్టార్‌ తో పాటు నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఇది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. సినిమా థియేటర్లలో రిలీజై 20 ఏళ్లు అవుతున్నా ఓటీటీలో మాత్ర దీని ఊపు తగ్గలేదు.

ఓటీటీలో స్ట్రీమింగ్ వివరాలు

‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ మూవీ 2005 ఆగస్టు 19న థియేటర్లో రిలీజైంది. 26 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 177.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీనికి జుడ్ అపటో డైరెక్టర్. స్టీవ్ కారెల్, కెథరీన్ కీనెర్, పాల్ రూడ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 9 అవార్డులు సొంతం చేసుకుంది.

ఆండీ స్టిజర్ 40 ఏళ్ల ఓ ఇంట్రోవర్ట్. చాలా షై పర్సన్. ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ లో స్టాక్ సూపర్ వైజర్ గా పని చేస్తాడు. అమ్మాయిలతో శృంగారం చేయాలని ప్రయత్నించి విఫలమవుతాడు. ఇక సింగిల్ గానే ఉండిపోతాడు. ఒక సందర్భంలో స్టిజర్ ఇంకా వర్జినే అన్న విషయం కో వర్కర్స్ డేవిడ్, జే, కాల్ కు తెలుస్తుంది. ఈ సంగతి తెలుసుకున్న బాస్ పౌలా.. అండీతో సెక్స్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆండీ ఒప్పుకోడు.

సినిమా విజయం మరియు అవార్డులు

ఆండీని తిరిగి శృంగారం చేసేందుకు ప్రయత్నించమని ఫ్రెండ్ ఎంకరేజ్ చేస్తారు. అమ్మాయిలను అట్రాక్ట్ చేసేలా మాట్లాడటంలో సాయం చేస్తారు. స్పీడ్ డేటింగ్ ఈవెంట్ కు ఇన్వైట్ చేస్తారు. వ్యాక్సింగ్ చేయిస్తారు. వేశ్య దగ్గరకు పంపిస్తారు. కానీ ఫలితం ఉండదు. హస్త ప్రయోగం చేసుకోమని కూడా సలహా ఇస్తారు.

ఓ కస్టమర్ త్రిష్ పీడ్మంట్ తో డేట్ కు వెళ్తాడు ఆండీ. వాళ్లు శృంగారం చేస్తున్నారనే సమయంలో త్రిష్ కూతురు వచ్చింది డిస్టెర్బ్ చేస్తుంది. మరి ఆండీ వర్జినిటీ కోల్పోయాడా? సింగిల్ మదర్ త్రిష్ హెల్ప్ చేసిందా? అన్నదే కథ. ఈ మూవీలో న్యూడ్ సీన్లు కూడా ఉన్నాయి.

‘ది 40 ఇయర్ ఓల్డ్ వర్జిన్’ సినిమా ఓటీటీలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ బోల్డ్ కామెడీని మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.