|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు ఇవే.. అన్ని తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒక్కోటి ఒక్కో రకం.. ఇక్కడ చూసేయండి!

Published: 30-05-2025, 11:48 PM
ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు ఇవే.. అన్ని తెలుగులోనే స్ట్రీమింగ్.. ఒక్కోటి ఒక్కో రకం.. ఇక్కడ చూసేయండి!

ఈ వారం ఓటీటీలో 27 కంటే ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. అయితే, 7 ఉత్తమమైన తెలుగు సినిమాలు మాత్రమే మీ కోసం ఎంచుకున్నాము. విభిన్న జోనర్లలో ఉన్న ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Key Points

1

నాని నటించిన హిట్ 3 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్!

2

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ జియో హాట్‌స్టార్ లో!

4

డిపార్ట్‌మెంట్ క్యూ అనే క్రైమ్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ లో!

హిట్ 3, కెప్టెన్ అమెరికా మరియు మరిన్ని!

ఓటీటీలో ఈ వారం సుమారుగా 27కిపైగా సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఏడు సినిమాలు మాత్రం చూసేందుకు ది బెస్ట్‌గా ఉన్నాయి. అది కూడా తెలుగు భాషలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కో రకమైన జోనర్లలో ఉన్న ఆ ది బెస్ట్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

వరల్డ్ వైడ్‌గా ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సూపర్ హీరో మూవీ ఫ్రాంచైజీ మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన కొత్త సినిమా కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్. అమెరికా అధ్యక్షుడే రాక్షసుడిలా మారితే సూపర్ హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లోని ఈ సినిమా మే 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్‌లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వివిధ జోనర్లలో ఉత్తమ ఓటీటీ సినిమాలు

నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇప్పుడు మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచి హిట్ 3 ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1లో దూసుకుపోతోంది.

బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ల్లో క్రిమినల్ జస్టీస్ ఒకటి. లీగల్ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కే ఈ సిరీస్‌లో నాలుగో సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో క్రిమినల్ జస్టీస్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ అయింది. మే 29 నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లో క్రిమినల్ జస్టీస్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హాలీవుడ్‌ నుంచి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిపార్ట్‌మెంట్ క్యూ. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్, 83 శాతం రొట్టెన్ టొమాటోస్ నుంచి ఫ్రెష్ కంటెంట్ అనిపించుకున్న డిపార్ట్‌మెంట్ క్యూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. మే 29 నుంచి తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఈ వారం ఓటీటీలో ఏం చూడాలి?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , సీనియర్ హీరోయిన్ శోభన జోడీగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తుడరుమ్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన తుడరుమ్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. మే 30 నుంచి మలయాళం, తెలుగు, హిందీ సహా సౌత్ భాషల్లో తుడరుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా లాస్ట్ బ్రీత్. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ దక్కించుకున్న లాస్ట్ బ్రీత్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో మే 30న లాస్ట్ బ్రీత్ ఓటీటీ రిలీజ్ అయింది.

తమిళ స్టార్ హీరో సూర్య, బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడీ కట్టిన గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో నెట్‌ఫ్లిక్స్‌ లో మే 30 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలైన ఉత్తమ తెలుగు సినిమాలను ఆస్వాదించండి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని, చూడటం మొదలుపెట్టండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.