
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీ జీవితంపై ఆధారంగా రూపొందించిన ‘7 షేడ్స్ ఆఫ్ ధోనీ’ డాక్యుమెంటరీ జియోహాట్‌స్టార్‌లో విడుదలైంది. ధోనీ క్రికెట్ ప్రయాణం, అతని కష్టాలు, విజయాలను ఈ డాక్యుమెంటరీ చక్కగా చూపిస్తుంది.
Key Points
ధోనీ బాల్యం నుండి కెప్టెన్ కూల్‌గా ఎదిగిన ప్రయాణం.
ఏడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ, ప్రతి ఎపిసోడ్ కేవలం కొద్ది నిమిషాల నిడివి.
జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ధోనీ జీవిత ప్రస్థానం
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిరీస్ ‘7 షేడ్స్ ఆఫ్ ధోనీ’. ఇది ఇప్పుడు జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ధోని బాల్యం నుంచి ‘కెప్టెన్ కూల్’గా మారిన ప్రస్థానాన్ని ఈ ప్రత్యేక సిరీస్ ఆవిష్కరిస్తుంది.
తన అద్భుతమైన శైలి, అద్భుతమైన క్రీడాస్ఫూర్తితో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ (ఎమ్‌ఎస్‌డీ) పుట్టినరోజు సందర్భంగా ఈ షార్ట్ సిరీస్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు, ఇది ఎందుకు చూడదగినదో ఇక్కడ తెలుసుకుందాం.
ధోనీ సోమవారం (జులై 7) తన 44వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా జియోహాట్‌స్టార్ ఈ 7 షేడ్స్ ఆఫ్ ధోనీ సిరీస్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఇందులో ధోని కష్టాలు, ఆ తర్వాత విజయ తీరాలకు చేరిన స్ఫూర్తిదాయకమైన కథనం మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
రాంచీలోని ఒక చిన్న స్టేడియం నుంచి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఎమ్‌ఎస్ ధోనీ సాగించిన ప్రయాణం అసాధారణమైనది. ఈ ప్రత్యేకమైన డాక్యుసిరీస్ ఏడు ఎపిసోడ్‌లుగా వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌లో ఎమ్‌ఎస్‌డీ పడిన కష్టాలను, ఆ తర్వాత అతను ఎలా విజయాన్ని సాధించాడో వివరిస్తుంది. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కీపర్ బ్యాటర్‌గా ధోని ఎదిగిన ప్రస్థానాన్ని ఇది వివరిస్తుంది.
ఏడు ఎపిసోడ్లు అయినా అవన్నీ చాలా చిన్నవే. తక్కువ నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్లు అయితే కేవలం ఎనిమిదేసి నిమిషాలతోనే రావడం విశేషం. అన్నీ కలిపి గంటన్నరలోనే చూసేయొచ్చు.
ఎపిసోడ్ 1: ‘మహీ మార్ రహా హై’
‘7 షేడ్స్ ఆఫ్ ధోనీ’ డాక్యుమెంటరీ విశేషాలు
ఈ ఎపిసోడ్ ధోనీ క్రీడా జీవితం ప్రారంభ రోజులను వివరిస్తుంది. వికెట్ కీపర్‌గా క్రికెట్‌కు అంకితమయ్యే ముందు ధోనీ ఫుట్‌బాల్ ఆడిన రోజులను చూడొచ్చు. కేవలం 13 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది.
ఎపిసోడ్ 2: ‘రాంచీ నుంచి టీమిండియా వరకు’
ఇక ఈ రెండవ ఎపిసోడ్ ధోనీ ఎదుర్కొన్న ప్రారంభ వైఫల్యాలు, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజంగా ఎదగడానికి అతను చేసిన నిశ్శబ్ద పోరాటాలను చూపిస్తుంది. దీని నిడివి 11 నిమిషాలుగా ఉంది.
ఎపిసోడ్ 3: కెప్టెన్ ఆఫ్ యంగిండియా
15 నిమిషాల నిడివి ఉన్న మూడో ఎపిసోడ్ అంతర్జాతీయ ధోనీ కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన 2007 టీ20 వరల్డ్ కప్, కెప్టెన్సీ బాధ్యతలు, కప్పు గెలిచిన తీరును కళ్లకు కడుతుంది.
ఎపిసోడ్ 4: బికమింగ్ కెప్టెన్ కూల్
జియోహాట్‌స్టార్‌లో ప్రసారం
ఈ ఎపిసోడ్ ధోనీ అత్యంత విజయవంతమైన ఇండియన్ కెప్టెన్ గా, కెప్టెన్ కూల్ గా ఎదిగిన తీరు.. 3 ఐసీసీ ట్రోఫీలు సాధించిన తీరును చూపెడుతుంది. 19 నిమిషాల నిడివి ఉన్న ఎపిసోడ్ ఇది.
ఎపిసోడ్ 5: ధోనీ ద ఫినిషర్
ధోనీలోని ఫినిషర్ ను చూపించే ఎపిసోడ్ ఇది. వైట్ బాల్ క్రికెట్ లో మ్యాచ్ లను తనదైన స్టైల్లో ముగించే అతడి సామర్థ్యాన్ని చూపెడుతూ ఈ ఐదో ఎపిసోడ్ 17 నిమిషాల పాటు సాగుతుంది.
ఇక ఆరో ఎపిసోడ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానాన్ని చూపిస్తుంది. కెప్టెన్ కూల్ సీఎస్కేలో ఎలా తలా ధోనీగా మారి ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడో ఇందులో చూడొచ్చు. కేవలం 8 నిమిషాలే ఉంటుంది.
ఎపిసోడ్ 7: ఎమ్మెస్డీ ఫరెవర్
ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా అతని మానియా ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం ఏంటి? అతన్ని ప్రత్యేకంగా నిలిపింది ఏంటి అన్నది ఈ చివరి ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇది కూడా 8 నిమిషాలే ఉంటుంది.
చిన్నప్పటి నుండి అతని కష్టపడి పొందిన విజయాలను చూపిస్తూ, ఈ సిరీస్ ధోని అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. అతని స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని మీ పిల్లలతో కలిసి ఆస్వాదించండి.


