
యంగ్ హీరోయిన్ అనంతిక నటిస్తున్న ‘8 వసంతాలు’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Key Points
‘8 వసంతాలు’ సినిమా జూన్ 20న విడుదల
సినిమా టీజర్ జూన్ 7న విడుదల కానుంది
చిత్రం బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీతో తెరకెక్కుతోంది
‘8 వసంతాలు’ విడుదల తేదీ ప్రకటన
యంగ్ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్(Anantika Sunilkumar) ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘8 వసంతాలు’ (8Vasantalu )చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫణీంద్ర(Phanindra) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీతో రాబోతోన్న ఈ చిత్రంలో అనంతిక శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ‘8 వసంతాలు’ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 7న రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక ఇందులో హీరోయిన్ అనంతిక చీరలో కనిపించి అందరికీ మెస్మరైజ్ చేసింది.
టీజర్ విడుదల తేదీ
అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్ర
‘8 వసంతాలు’ సినిమా టీజర్, విడుదల తేదీల ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. బ్యూటీఫుల్ బ్రేకప్ స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


