|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది

Published: 29-10-2025, 4:44 PM
ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది

‘‘రాజు వెడ్స్ రాంబాయి’’ చిత్రం వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కి నవంబరు 21న విడుదల కానుంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో, వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించిన ఈ సినిమా ‘‘7/జీ బృందావన్‌ కాలనీ’’ వంటి గుర్తుండిపోయే చిత్రాల జాబితాలో చేరుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Key Points

1

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

2

నవంబరు 21న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

4

దర్శకుడు వేణు ఊడుగుల తన తదుపరి సినిమా యూవీ క్రియేషన్స్‌లో ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని తెలిపారు.

‘రాజు వెడ్స్ రాంబాయి’: వాస్తవ సంఘటనల ఆధారంగా

‘‘ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా కథ రాసుకున్నాడు సాయిలు. ప్రేమతో కూడిన విషాద భరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి, అక్కడే సమాధి అయ్యింది. ఎంటర్‌టైనింగ్‌గా, మాస్‌ అప్పీల్‌ ఉండేలా సాయిలు ఈ స్క్రిప్ట్‌ రాశాడు. ‘7/జీ బృందావన్‌ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్‌ 100, బేబీ’ చిత్రాల్లా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇక నా దర్శకత్వంలోని సినిమాకు యూవీ క్రియేషన్స్‌ సంస్థలో ప్రీ ్ర΄÷డక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాత వేణు ఊడుగుల అన్నారు.

అఖిల్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 21న రిలీజ్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ ప్రకటించింది. వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా చూశాక ప్రేక్షకులు ఓ ఎమోషనల్‌ ఫీల్‌తో థియేటర్స్‌ నుంచి బయటకొస్తారు’’ అని అన్నారు బన్నీ వాసు. ‘‘ఒకే ఒక నరేషన్‌లో వేణుగారు మా సినిమాను ఓకే చేశారు’’ అన్నారు సాయిలు. ‘‘ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఇందులోని నటీనటులను తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుంటుంది’’ అని చెప్పారు వంశీ నందిపాటి.

దర్శక నిర్మాత బృందం అభిప్రాయాలు

విడుదల తేదీ & అంచనాలు

‘‘రాజు వెడ్స్ రాంబాయి’’ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బలమైన కథ, భావోద్వేగ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. ఈ సినిమాలోని నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.