|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏకంగా 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. చరిత్ర సృష్టించిన సినిమా..

Published: 12-10-2025, 6:04 PM
ఏకంగా 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. చరిత్ర సృష్టించిన సినిమా..

అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో చరిత్ర సృష్టించింది. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 13 అవార్డులు గెలుచుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించకపోయినా, అవార్డుల్లో మాత్రం సత్తా చాటింది.

Key Points

1

అమీర్ ఖాన్ నిర్మించిన 'లాపతా లేడీస్' 13 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది.

2

కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'గల్లీ బాయ్' రికార్డును సమం చేసింది.

4

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి(క్రిటిక్స్) వంటి ప్రధాన అవార్డులను గెలుచుకుంది.

‘లాపతా లేడీస్’ సృష్టించిన చరిత్ర

అమీర్ ఖాన్ నిర్మించిన ‘లాపతా లేడీస్’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించింది. ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏకంగా పదమూడు అవార్డులు గెలుచుకుని ‘గల్లీ బాయ్’ సరసన నిలిచింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌తో సహా అనేక విభాగాల్లో సత్తా చాటింది.

నిజానికి ఈ చిత్రం వెండితెరపై సరిగ్గా వర్క్ చేయలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు అవార్డు ఫంక్షన్స్‌లో స్పెషల్ అప్లాజ్ పొందింది. ఓటీటీలోనూ దుమ్ములేపింది. రూ. 5కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 27.06 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది. కానీ ఫిల్మ్ ఫేర్‌లో సత్తాచాటింది.

* ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు

* ఉత్తమ చిత్రం – లాపతా లేడీస్

* ఉత్తమ నటి(క్రిటిక్స్) – ప్రతిభా రంతా

బాక్సాఫీస్ వద్ద నిరాశ.. అవార్డుల్లో ప్రశంసలు

* ఉత్తమ డెబ్యూ ఫిమేల్ : నితాశి గోయల్

* ఉత్తమ సహాయ పాత్ర (మహిళ) – ఛాయా కదమ్

* ఉత్తమ సహాయ పాత్ర (పురుషుడు) – రవి కిషన్

* ఉత్తమ నేపథ్య గాయకుడు – అరిజిత్ సింగ్ (సజ్ని)

* ఉత్తమ డైలాగ్ – స్నేహా దేశాయ్

లాపతా లేడీస్ గెలుచుకున్న కీలక అవార్డులు

* ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – రామ్ సంపత్

* ఉత్తమ సాహిత్యం – ప్రశాంత్ పాండే

* ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – రామ్ సంపత్

* ఉత్తమ కాస్ట్యూమ్ – దర్శన్ జలాన్

* ఉత్తమ స్క్రీన్ ప్లే – స్నేహా దేశాయ్

‘లాపతా లేడీస్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో తిరుగులేని విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా సాధించిన 13 అవార్డులు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.