|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమానుషత్వంపై ధిక్కార స్వరం.. బైసన్ సినిమా

Published: 02-11-2025, 3:20 PM
అమానుషత్వంపై ధిక్కార స్వరం.. బైసన్ సినిమా

అమానుషత్వం, కుల వివక్షపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ‘బైసన్’ సినిమా విడుదల కానుంది. అర్జున అవార్డు గ్రహీత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, దళితులు ఎదుర్కొనే సవాళ్లను, కబడ్డీ ఆటగాడి పోరాటాన్ని అద్భుతంగా చిత్రీకరించింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Key Points

1

దళితులు నిత్యం ఎదుర్కొనే కుల వివక్ష, సామాజిక అన్యాయం చిత్రంలో ప్రతిబింబిస్తుంది.

2

అర్జున అవార్డు గ్రహీత మహతి గణేశన్ జీవితం ఆధారంగా 'బైసన్' కథ తెరకెక్కింది.

4

దర్శకుడు మారి సెల్వరాజ్ కులతత్వం, అహంకారం, కుట్ర కోణాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.

బైసన్: కుల వివక్షపై ధిక్కార స్వరం

‘కోటాలో వచ్చాడు, ఎవడో కాళ్లు పట్టుకుని పైకి వచ్చాడు, ఇంకెవడో వెనకాల ఉంటే ఈ స్థాయికి వచ్చాడు, వాడి గురువు బాపనోడు కాబట్టి తెలివి వచ్చింది’. ఇలాంటివి ప్రతీ రంగంలో ఎంతో కొంత ఎదిగిన ప్రతి దళితుడు ఎదుర్కొనే సర్వ సాధారణ మైన కామెంట్స్. ‘మా విలువ మా మేధస్సుకు కాదు, మా మాంసానికి, మా పుట్టుకకు మాత్రమే… అని నడుస్తున్న శవంలా మథన పడని (సామాజిక స్పృహ కల్గిన) దళితుడు బహుశా ఉండకపోవచ్చు. ఇక మా ఆడవాళ్లనైతే ఎవడితోనో పడుకున్నందుకే ఇంత పైకి వచ్చింది అని తేల్చేసారు. నాతోనే, నా పక్కనే ఉండే ఒక రెడ్డి గారు ‘దళిత అమ్మాయిలు వాళ్లకి పెళ్లైన తర్వాత కూడా రెడ్డి అబ్బాయిలతోనే పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు తెలుసా?’ అని నాతోనే అన్నాడు!

ఇవి మా జీవితాలు.. జీవిత సత్యాలు! ఇలాంటి ఎన్నో చురకత్తుల మోపులని నెత్తిన మోస్తూ, గుండెల్లోని బరువుని పంటి బిగువున దాచి ఉంచి, పైకి మాత్రం నవ్వుకుంటూ తమ తమ రంగాలలో ప్రతిభను కనబర్చి కూడా ‘మీకేంటి… రిజర్వేషన్లు ఉన్నాయి కదా’ అనిపించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని ప్రోత్సహించి నెత్తిన పెట్టుకోవాల్సిన పని లేదు. తెలివి అవసరమైన చోట మాకు మెరిట్ లేదు అని.. కండ బలం అవసరమైన చోట మా శరీరాలు అంటరానివి అని… మాకు అడ్డు పడకపోతే చాలు. మా చావు మేము చస్తాము అని నాకు ప్రతి రోజూ అనిపిస్తుంది.

కబడ్డీ ఆటగాడి నిజ జీవిత పోరాటం

ఇదే ‘బైసన్’ సినిమాలో కంటికి కట్టినట్టు చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. కుల వివక్ష, తన చుట్టూ ఉన్న రాజకీయాలు, మతం వంటివి ఏవీ పట్టించుకోకుండా.. తన పుట్టక ముందు నుంచి ఎవరో తెలియని వారితో వైరుధ్యం ఎందుకుందో అర్ధం కాక, తన ప్రతిభను కాక ప్రాతినిధ్యాన్ని బట్టి బేరీజు వేసే సమాజంతో పోరాడుతూ.. ‘మనకు ఏదీ అంత సులభంగా రాదు… రానివ్వరు.. మనమే సాధించుకోవాలి’ అని ప్రోత్సహించే తండ్రి, ధీటుగా నిలబడే అక్క ప్రేరణతో భారతదేశాన్ని అంతర్జాతీయ కబడ్డీ పోటీలలో గెలిపించిన ఒక యువకుడి కథే ఈ బైసన్.

నిజ జీవితంలో అర్జున అవార్డు గ్రహీత, మహతి గణేశన్ జీవితం ఆధారంగా తీసిన చిత్రంలో బైసన్ పేరు ‘వినతి కిట్టాన్’. ఒక ఆధిపత్య కులం, ఒక దళిత కులం మధ్య ఉన్న సామాజిక వ్యత్యాసం, కులతత్వం – అహంకారం – కుట్ర కోణం వంటివి చెప్పకనే కంటికి కట్టినట్టు చూపిస్తాడు దర్శకుడు. ఈ సినిమా అసలు పేరు బైసన్ – ‘కాల మాడన్’ అంటే కాలానికి ఎదురెళ్లే వాడు అని చదివాను. దళితులు బతికి, తమ రంగంలో ప్రతిభ చూపిస్తున్నారు అంటే.. వారే కాల మాడన్‌లు. ఇన్ని అవరోధాలు దాటుకుని వచ్చిన వారి కథ – సమాజం సృష్టించిన అవరోధాలను దాటలేక రోజు కూలీ అయిన దళితుల కథ బైసన్.

మారి సెల్వరాజ్ దర్శకత్వ ప్రతిభ

ఇది సినిమా మాత్రమే కాదు… అమానుషత్వంపై ఒక ధిక్కార స్వరం. మా జీవన పోరాటానికి కళాత్మక రూపం. వేదనను చిత్రించిన కళ, కళలో చిత్రించబడిన వేదన. మా దైవం ఆవు కాదు బర్రె. మా సంస్కృతి cow Nationalism కాదు. Buffello nationalism. ఎవరు ఏమన్నా, ఎవరి సహాయంతో అయినా…. పోరాటం చేయాలి. ప్రతిరోజూ నిరూపించుకోవాలి. తెరపై గ్రాఫిక్స్‌తో సృష్టించిన అద్భుతాన్ని కాదు… సమాజాన్ని, మీలోని మనిషిని తట్టి లేపే వాస్తవాన్ని చూడాలి అనుకుంటే.. బైసన్ చూడండి.

తెలంగాణ హైకోర్టు న్యాయవాది,

‘బైసన్’ చిత్రం కుల వివక్షపై సాగే పోరాటానికి నిదర్శనం. ప్రతిభకు కాకుండా పుట్టుకకు విలువనిచ్చే సమాజానికి ఇది బలమైన సమాధానం. ఈ స్ఫూర్తిదాయక చిత్రం అందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.