
📌 Key Points
- పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, లోకేష్ కానగరాజ్ తో AA23 మూవీ!
- లోకేష్ చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ విని అల్లు అర్జున్ ఫుల్ ఎగ్జైటెడ్ అంట!
- ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.. ఫ్యాన్స్ కి పండగే!
- అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఒక భారీ సినిమా అవుతుందని సినీ విశ్లేషకుల అంచనా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పుష్ప 2 తర్వాత ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 రాబోతుంది. ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
లోకేష్ తో బన్నీ మూవీ: స్క్రిప్ట్ అదుర్స్!
AA23: పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్టులు మాత్రమే చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీతో ఓ భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఆ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్(AA23) తో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు అధికారిక ప్రకటన ఓటీవలె వచ్చింది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోకి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ వీడియోకి అనిరుద్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఏప్రిల్ నుండి AA23 రెగ్యులర్ షూటింగ్?
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ మ్యూజిక్ నే వినిపించింది. జస్ట్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ కాంబోలో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుడా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా అల్లు అర్జున్, లోకేష్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే, దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఇటీవలే అల్లు అర్జున్ ని కలిశాడట.
2027లో బన్నీ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్!
తన సినిమాకు సంబందించిన ఫైనల్ స్క్రిప్ట్ ను వినిపించాడట లోకేష్. దానికి అల్లు అర్జున్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. కథ పక్కాగా సెట్ అయ్యిందని చాలా హ్యాపీ ఫీలయ్యాడట అల్లు అర్జున్. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది అని తెలుస్తోంది. ఓపక్క అట్లీ సినిమా చేస్తూనే మరోపక్క లోకేష్ సెట్స్ కి రానున్నాడు అల్లు అర్జున్. ఇక లోకేష్ సినిమా కూడా 2027 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్, లోకేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


